కొత్త ఏడాదిలో iPhone యూజర్లకు షాకింగ్ న్యూస్

by Harish |   ( Updated:2023-01-03 07:29:36.0  )
కొత్త ఏడాదిలో iPhone యూజర్లకు షాకింగ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: యాపిల్ కంపెనీ తన వినియోగదారులకు షాకింగ్ లాంటి వార్త అందించింది. iPhone 13 లేదా పాత iPhone మోడల్‌లను వాడుతున్న వినియోగదారులు ఫోన్ బ్యాటరీని మార్చుకున్నట్లయితే ఇక మీదట భారీ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. వారంటీ లేని ఫోన్ల బ్యాటరీ రీప్లేస్‌మెంట్ ధరను దాదాపు రూ. 1654( $20) మేరకు పెంచనున్నట్ల యాపిల్ కంపెనీ పేర్కొంది. పెరిగిన కొత్త ధరలు మార్చి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇంతకు ముందు భారత్‌లో బ్యాటరీ రీప్లేస్‌మెంట్ ధర రూ. 7,000 గా ఉంది.


AppleCare+ మెంబర్స్ మాత్రం తమ ఐఫోన్ బ్యాటరీలను దాని అసలు కెపాసిటీలో 80 శాతం కంటే తక్కువ కలిగి ఉన్నట్లయితే, ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా తమ ఐఫోన్ బ్యాటరీలను మార్చుకోవచ్చని కంపెనీ తెలిపింది. యాపిల్ కంపెనీ ఇటీవల క్రమంగా బ్యాటరీ కెపాసిటీ పెంపుదలపై దృష్టి సాధించింది. iPhone 14 Pro 3,200mAh బ్యాటరీ, iPhone 14 Pro Max 4,323mAh బ్యాటరీని అందించింది. అదే విధంగా iPhone 15 లో కూడా మెరుగైన బ్యాటరీని అందివ్వాలని కంపెనీ భావిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed