ఇన్‌స్టాగ్రామ్ డిలీట్ చేయకుండానే థ్రెడ్స్ అకౌంట్ క్లోస్ చేసే కొత్త ఆప్షన్

by Harish |   ( Updated:2023-11-14 12:45:39.0  )
ఇన్‌స్టాగ్రామ్ డిలీట్ చేయకుండానే థ్రెడ్స్ అకౌంట్ క్లోస్ చేసే కొత్త ఆప్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని ‘ఎక్స్’ కు పోటీగా మెటా కంపెనీ థ్రెడ్స్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇది లాంచ్ అయిన కొద్ది రోజుల్లోనే ఎక్కువ సంఖ్యలో డౌన్‌లోడ్‌లను సాధించింది. అయితే థ్రెడ్స్ అకౌంట్ మొత్తం కూడా ఇన్‌స్టాగ్రామ్‌కు లింక్ అయి ఉంటుంది. యూజర్లు థ్రెడ్స్ అకౌంట్‌ను డిలీట్ చేయాలంటే ఇన్‌స్టా ఖాతా కూడా డిలీట్ అవుతుంది. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తొలగించకుండా థ్రెడ్స్ ను తొలగించడం సాధ్యం కాదు.

అయితే దీని పట్ల యూజర్లు అసంతృప్తిగా ఉన్నారు. ఈ సమస్య గురించి వారు ఆందోళనను లేవనెత్తగా, తాజాగా దీనికి పరిష్కారాన్ని మెటా అందించింది. ఇక మీదట థ్రెడ్స్ ఖాతాను తొలగించాలంటే దానికి అనుబంధంగా ఉన్న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను డిలీట్ చేయాల్సిన అవసరం లేదని కంపెనీ పేర్కొంది. నేరుగా థ్రెడ్స్ ఖాతాను డిలీట్ చేయాలనుకుంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్ డియాక్టివేట్/డిలీట్ ఆప్షన్లలో నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు అని కంపెనీ తెలిపింది. యూజర్ డిలీట్ ఆప్షన్ ఎంచుకున్నట్లయితే అకౌంట్ పూర్తిగా డిలీట్ అవుతుంది.

అలాగే మరో ఆప్షన్‌ను కూడా కంపెనీ అందించింది. థ్రెడ్స్‌లో చేసే పోస్టులు ఫెస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించకుండా నియంత్రించే ఆప్షన్‌ను యూజర్లకు ఇచ్చింది. ఇంతకు ముందు థ్రెడ్స్‌లో చేసే పోస్టులు ఫెస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించేవి, దీని వల్ల యూజర్లకు తమ థ్రెడ్స్ పోస్టులపై నియంత్రణ లేకుండా పోయింది. అయితే ఇక మీదట యూజర్లు థ్రెడ్స్‌లో చేసే పోస్టులు ఎక్కడ కనిపించాలో ఎంచుకునే ఆప్షన్ ఉంటుంది. ప్రైవసీ సెట్టింగ్స్‌లో దీనికి సంబంధించి మార్పులు చేశారు.

Advertisement

Next Story