- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆరు వేలకే అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్ ఫోన్
దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య కాలంలో ఎవరిని చూసినా స్మార్ట్ ఫోన్ వాడేవారే. పిల్లల్ని మొదలుకొని ముసలివారి వరకు ప్రతి ఒక్కరి జీవితంలో స్మార్ట్ ఫోన్ ఒక భాగం అయిపోయింది. దీంతో మొబైల్ కంపెనీలు కూడా కొత్త కొత్త ఫీచర్లతో మొబైల్స్ ని మార్కెట్ లోకి లాంచ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇన్‌ఫీనిక్స్ కంపెనీ తక్కువ ధరలో ఎక్కువ మందిని ఆకట్టుకునే ఓ స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8 హెచ్‌డీ స్మార్ట్ ఫోన్. వినియోగదారులను ఆకట్టుకునే రంగులలో ఫోన్ డిజైన్ చేశారు. ఇక ఈ ఫోన్ ఫీచర్స్ ఏంటి, ధర ఎంత తెలుసుకుందాం..
స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8 హెచ్‌డీ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్జ్
6.6 అంగుళాల హెచ్‌డీ డిస్ ప్లే
500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ ఆప్షన్
3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్
6 జీబీ వరకు ఎక్స్‌ప్యాండబుల్ స్టోరేజ్
ప్రాసెసర్ ఆక్టాకోర్ యూనిసోక్ టీ606
ఆండ్రాయిడ్ 13
ఎక్స్ఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టం
పంచ్ హోల్ కటౌట్
13 మెగాపిక్సెల్ కెమెరా.. ఏఐ లెన్స్
8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ బ్యాకప్ 5000 ఎంఏహెచ్
ఇక మిగతా విషయాలకొస్తే ఈ మొబైల్ లో మ్యాజిక్ రింగ్ అనే సాఫ్ట్ వేర్ ఫీచర్ అందుబాటులో ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు ఫేస్ అన్‌లాక్‌ను కూడా ఈ స్మార్ట్ ఫోన్ లో అందుబాటులో వచ్చింది. బ్యాక్‌గ్రౌండ్ కాల్స్, లో బ్యాటరీ రిమైండర్స్, ఛార్జింగ్ యానిమేషన్ల లాంటి నోటిఫికేషన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఫుల్ ఛార్జింగ్ తర్వాత 50 గంటల పాటు మ్యూజిక్ ప్లేబ్యాక్ టైమ్, 39 గంటల కాలింగ్ టైమ్, 36 గంటల వీడియో ప్లే బ్యాక్ టైంను ఈ మొబైల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. అంతే కాదు పిల్ ఆకారంలో ఉన్న మ్యాజిక్ రింగ్ ఫీచర్ నోటిఫికేషన్ల కోసం అందించారు.
ఇక ధర విషయానికొస్తే 3 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ఉన్న మొబైల్ ధర కేవలం రూ.6,299 మాత్రమే. యాక్సిస్ బ్యాంక్ కార్డు ద్వారా పర్చేస్ చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ వచ్చి రూ. 5,669 కే వినియోగదారులకు అందించవచ్చు. ఇక కలర్ విషయానికొస్తే షైనీ గోల్డ్, టింబర్ బ్లాక్, క్రిస్టల్ క్లీన్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి.