Laptop: ఒక్క చార్జింగ్‌తో 14 గంటలు.. ల్యాప్‌టాప్‌ను విడుదల చేసిన Infinix

by Harish |
Laptop: ఒక్క చార్జింగ్‌తో 14 గంటలు.. ల్యాప్‌టాప్‌ను విడుదల చేసిన Infinix
X

దిశ, టెక్నాలజీ: Infinix కంపెనీ ఇండియాలో కొత్త ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. దీని పేరు ‘Infinix InBook Y3 Max’. దీనిని ఒక్కసారి చార్జింగ్ చేసినట్లయితే 14.6 గంటల స్టాండ్‌బై వరకు చార్జింగ్ ఉంటుంది. ఇందుకోసం 70Wh బ్యాటరీని అందించారు. ఈ ల్యాప్‌టాప్ 16-అంగుళాల పూర్తి-HD IPS డిస్‌ప్లేను కలిగి ఉంది. 300నిట్స్ బ్రైట్‌నెస్, 87 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో వచ్చింది. 12th Gen ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌లతో Intel Core i3, Core i5, Core i7 ఎంపికలతో ఇంటిగ్రేటెడ్ ఇంటెల్ గ్రాఫిక్స్‌‌తో అందుబాటులో ఉంటుంది. 16GB RAM, 1TB వరకు స్టోరేజ్‌ను కలిగి ఉంది. విండోస్ 11 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతుంది. దీని బాడీ మొత్తం అల్యూమినియం అల్లాయ్, కఠినమైన బ్రష్ మెటల్ ఫినిషింగ్‌తో ఉంటుంది.

ల్యాప్‌టాప్ డ్యూయల్ మైక్రోఫోన్‌లతో కూడిన పూర్తి-HD (1080p) వెబ్‌క్యామ్‌ను కలిగి ఉంది. థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం ఇన్ఫినిక్స్ ఐస్ స్టార్మ్ కూలింగ్ టెక్నాలజీని అందించారు. చార్జింగ్ పోర్ట్ టైప్ C. 65W ఫాస్ట్ చార్జింగ్‌తో 70Wh బ్యాటరీ ఉంది. ఒక్కసారి చార్జ్ చేస్తే బ్యాటరీ గరిష్టంగా 8.5 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను అందించగలదు. దీని బరువు 1.78 కిలోగ్రాములు. Infinix InBook Y3 మ్యాక్స్ ఇంటెల్ కోర్ i3 ప్రారంభ ధర రూ.29,999. ఇది బ్లూ, గ్రే, సిల్వర్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఆగస్టు 21 నుండి అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed