ఇన్‌స్టాగ్రామ్‌లో ఐఫోన్‌‌పై డిస్కౌంట్ అని రూ. 29 లక్షలు వసూలు

by Harish |   ( Updated:2023-03-06 15:12:35.0  )
ఇన్‌స్టాగ్రామ్‌లో ఐఫోన్‌‌పై డిస్కౌంట్ అని రూ. 29 లక్షలు వసూలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో ఆఫర్లు, డిస్కౌంట్ల పేరుతో పలువురి నుంచి డబ్బులు కాజేసిన ఘటనలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అలాంటి సంఘటనే ఒకటి దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన వికాస్ కతియార్ అనే అతను ఇన్‌స్టాగ్రామ్‌లో డిస్కౌంట్ రేట్లలో ఐఫోన్లు వస్తాయని ఒక యాడ్‌ను చూశాడు. దీంతో తక్కువ ధరలో ఐఫోన్ లభిస్తుందని భావించాడు. కానీ ఇది నకిలీ ఆ లేక ఒరిజినల్ ఆ అని తెలుసుకోవడానికి మరోక పేజీలో పాత కొనుగోలు దారులను సంప్రదించడంతో వారు అది ఒరిజినల్ అని, ఎలాంటి సమస్యలు లేవని ఫోన్ వర్క్ అవుతున్నట్లు పేర్కొనడంతో యాడ్‌లో ఉన్న ఫోన్ కొనాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఫిబ్రవరి 6న యాడ్‌ చూపించిన విధంగా ఒక ఫోన్ నెంబర్‌‌లో అవతలి వారిని సంప్రదించాడు.

వారు మొదటగా ఫోన్ ధరలో 30 శాతం ముందుగా చెల్లించాలని కోరారు. దీంతో అతను రూ. 28,000 చెల్లించాడు. తరువాత కస్టమ్స్ హోల్డింగ్ క్లియరెన్స్, ఇతర ట్యాక్స్‌ల కింద మరింత అమౌంట్ డిమాండ్ చేస్తూ, వివిధ ఫోన్ నెంబర్స్ నుంచి అతనికి కాల్స్ చేశారు. దీంతో అతను పలు దఫాలుగా మొత్తంగా రూ. 28,69,850 చెల్లించాడు. ఆ డబ్బులతో పాటు, ఫోన్ వస్తుందని భావించినప్పటికీ అలా జరగకపోవడం, పైగా మరింత అమౌంట్ చెల్లించాలని వారి నుంచి ఫోన్ కాల్స్ వస్తుండటంతో అతను పోలీసులను సంప్రదించాడు. దీంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story