- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
HP కంపెనీ నుంచి మార్కెట్లోకి నాలుగు ల్యాప్‌టాప్‌లు
దిశ, వెబ్‌డెస్క్: HP కంపెనీ భారత మార్కెట్లోకి కొత్తగా నాలుగు ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. వీటి పేరు ‘HP 14, HP 15, HP పెవిలియన్ ప్లస్ 14, HP పెవిలియన్ X360’. ఈ కొత్త ల్యాప్‌టాప్‌లు సరికొత్త 13వ జెన్ ఇంటెల్ ప్రాసెసర్‌తో వచ్చాయి.
ఎంట్రీ-లెవల్ మోడల్ వేరియంట్‌లలో భాగంగా HP 14 & 15 ల్యాప్‌టాప్‌లు రెండు కూడా దాదాపు ఒకేరకమైన ఫీచర్స్‌ను కలిగి ఉన్నాయి. HP 14 వేరియంట్ 14 అంగుళాలు, HP 15 మోడల్ 15 అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉన్నాయి. రెండు పూర్తి HD 1920 x 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో సన్నని, తేలికపాటి డిజైన్‌ను కలిగి ఉంటాయి. HP 14 కేవలం 1.4 కిలోగ్రాముల బరువు ఉంటుంది, అయితే 15 మోడల్ 1.6 కిలోగ్రాముల బరువు ఉంటుంది. ల్యాప్‌టాప్‌లు Windows 11 హోమ్ ద్వారా రన్ అవుతాయి. అలాగే, 41Wh బ్యాటరీని కలిగి ఉన్నాయి. ఈ రెండు 8GB RAM, 512GB మెమరీతో వచ్చాయి.
HP పెవిలియన్ ప్లస్ 14
ఈ ల్యాప్‌టాప్ 14-అంగుళాల OLED డిస్‌ప్లే, 2880×1880 పిక్సెల్‌ల రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. అమెజాన్ అలెక్సా సపోర్ట్ కూడా ఉంది. 13వ జెన్ ఇంటెల్ i5-1335U ప్రాసెసర్, 16GB DDR4 RAM, 1TB SSD స్టోరేజ్‌ని కలిగి ఉంది. ల్యాప్‌టాప్‌లో 51Wh బ్యాటరీని అమర్చారు. దీని ధర రూ. 81,999.
HP పెవిలియన్ x360
ల్యాప్‌టాప్‌లో 14-అంగుళాల డిస్‌ప్లే, ఇంటెల్ కోర్ i5-1335U CPUని కలిగి ఉంది. ఇది గరిష్టంగా 16GB RAM, 1TB మెమరీని కలిగి ఉంటుంది. 43Wh బ్యాటరీని అమర్చారు. అలాగే, వెబ్‌క్యామ్ షట్టర్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ మొదలగు ఫీచర్లను కూడా అందించారు. ల్యాప్‌టాప్ 1.41 కిలోగ్రాముల బరువు ఉంటుంది. దీని ప్రారంభ ధర రూ. 57,999.