- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Honor: 108MP కెమెరా.. AI ఫీచర్లతో హానర్ 200 లైట్ 5G
దిశ, టెక్నాలజీ: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ హానర్ కొత్త మోడల్‌ను ఇండియాలో విడుదల చేసింది. దీని పేరు ‘Honor 200 Lite 5G’. ఇది 108-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. వినియోగదారులకు ఉపయోగకరంగా ఉండే AI ఆధారిత ఫీచర్లను అందించారు. మ్యాజిక్‌ఎల్‌ఎమ్, మ్యాజిక్ పోర్టల్, మ్యాజిక్ క్యాప్సూల్, మ్యాజిక్ లాక్ స్క్రీన్, పారలల్ స్పేసెస్ వంటి అనేక AI ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ ఒకే ఒక స్టోరేజ్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. 8GB RAM+ 256GB స్టోరేజ్ ధర రూ.17,999. ఇది అమెజాన్, ఎక్స్‌ప్లోర్ హానర్ వెబ్‌సైట్, ఎంపిక చేసిన స్టోర్‌ల ద్వారా సెప్టెంబర్ 27న ఉదయం 12 గంటల నుండి దేశంలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. కొనుగోలు సమయంలో తగ్గింపులు కూడా ఉన్నాయి.
Honor 200 Lite 5G ఫీచర్స్
* 6.7-అంగుళాల పూర్తి-HD+ (2,412 x 1,080 పిక్సెల్‌లు) AMOLED స్క్రీన్
* 2,000 నిట్స్ గరిష్ట ప్రకాశం, 3,240Hz PWM డిమ్మింగ్ రేట్
* ఆండ్రాయిడ్ 14-ఆధారిత MagicOS 8.౦తో రన్ అవుతుంది.
* MediaTek Dimensity 6080 SoC ద్వారా పనిచేస్తుంది.
* ఫోన్ బ్యాక్‌సైడ్ 108MP+5MP+2MP కెమెరాలు ఉన్నాయి.
* ముందు 50MP సెల్ఫీ కెమెరా ఉంటుంది.
* 35W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‌తో 4,500mAh బ్యాటరీ ఉంది.