Artificial Intelligence | రెస్యూమ్‌ తయారీకి ఏఐని వాడుతున్నారా.. మీ తెలివి తెల్లారినట్లే!

by Anjali |
Artificial Intelligence | రెస్యూమ్‌ తయారీకి ఏఐని వాడుతున్నారా.. మీ తెలివి తెల్లారినట్లే!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) కు సంబంధించిన వార్తలే వినిపిస్తున్నాయి. అన్ని రంగాల్లోనూ ఏఐ వాడకం అనివార్యంగా మారింది. ముఖ్యంగా ‘కొవిడ్‌ సమయంలో కరోనా వ్యాధిగ్రస్తులను గుర్తించి, వ్యాధి వ్యాప్తిని అరికట్టడంలో ఏఐ సాంకేతికత ఎంతో ఉపయోగపడింది. థర్మల్‌ ఇమేజింగ్‌ పరిజ్ఞానంతో రూపొందించిన ఇన్ఫ్రారెడ్‌ థర్మామీటర్‌ సాయంతో మనుషుల శరీర ఉష్ణోగ్రతలను భౌతిక దూరం పాటిస్తూ అంచనా వేయగలిగారు’.

కానీ ఈ ఏఐ మనకు తెలియకుండానే మనల్ని బద్ధకస్తుల్ని చేస్తుంది. మన గురించి మనం చెప్పడం మానేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను చెప్పమనే పరిస్థితి నెలకొంది. తాజాగా దీనిపై పలు కంపెనీలు ఓ భారీ ట్విస్ట్ ఇస్తూ ప్రకటనలు జారీ చేశాయి. ఏఐ సహాయంతో రెడీ చేసిన రెస్యూమ్‌లను నమ్మమని, ఆ విధంగా జెనరేట్ చేస్తే మాత్రం అంగీకరించమని మొహం మీదే చెబుతున్నాయి. ఎందుకు కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయంటే..? ‘టెల్ అజ్ అబౌట్ యువర్ సెల్ఫ్’ అని అడిగితే అవి వచ్చి చెబుతాయా? అని కంపెనీలు అభ్యర్థుల్ని క్వశ్చన్ చేశాయి.

టెక్నాలజీ, బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌,టెలికమ్యూనికేషన్స్‌, లాజిస్టిక్స్‌ ఇలా అన్ని కంపెనీల్లో ఏఐ క్రియేట్ చేసిన రెస్యూమ్‌లను రిజెక్ట్ చేస్తున్నాయి. స్వయంగా అభ్యర్థులే రాసిన రెస్యూమ్‌ను యాక్సెప్ట్ చేస్తున్నాయి. పలు సర్వేల ప్రకారం చూసినట్లైతే.. ఏఐ టూల్స్ ఉపయోగించి రెస్యూమ్‌లు రాస్తున్న వారి శాతం విరివిగా పెరుగుతున్నట్లు గుర్తించారు. ఏఐ వాడకంలో అమెరికా ముందు స్థానంలో ఉంది. 28 శాతం మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌నే వాడుతున్నారట.

Advertisement

Next Story

Most Viewed