Food on Train: రైలు ప్రయాణీకులకు గుడ్ న్యూస్ : ఇక వాట్సాప్ లో ఆ సేవలు

by Prasanna |
Food on Train: రైలు ప్రయాణీకులకు గుడ్ న్యూస్ : ఇక వాట్సాప్ లో ఆ సేవలు
X

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా ఏ రైలులోలైన ఫుడ్ కావాలంటే వాళ్లు వచ్చే వరకు వేచి చూడాలిసి ఉండేది . కానీ ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది. రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు , వారు ఏది కోరుకుంటే అది వెంటెనే తినవచ్చట. అదెలాగో ఇక్కడ చూద్దాం.

రైలులో ప్రయాణించే ప్రయాణికులు IRCTC యాప్ లేదా థర్డ్ పార్టీ యాప్స్ నుంచి నచ్చిన ఫుడ్ ను ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ సర్వీస్ను కొత్తగా ప్రారంభించారు. ప్రయాణం చేస్తుండగానే వాట్సప్‌లోనే ప్రయాణికులు ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. వాళ్ల ఫేవరెట్ రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకునే విధంగా ఈ యాప్ ను డిజైన్ చేశారు. దీనికి మీరు ఏమి చేయాలంటే.. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ నెంబరును సేవ్ చేసుకొని +918750001323 ఫుడ్ డెలివరి సేవలను ఉపయోగించండి.

www.catering.irctc.co.in లింకును ఓపెన్ చేసి PNR నెంబర్ ఎంటర్ చేయాలి.

ఆ తర్వాత వెంటనే వాట్సప్‌లో ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి ఒక లింక్ వస్తుంది.

వాట్సప్‌లో వచ్చే ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలి

Advertisement

Next Story