- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Facebook లో అదిరిపోయే ఫీచర్..Bringing HDR video to Reels
దిశ, వెబ్‌డెస్క్: మెటా యజమాన్యంలోని ఫేస్‌బుక్‌లో కొత్తగా ఒక ఫీచర్‌ను తీసుకొచ్చారు. HDRలో వీడియోలను అప్‌లోడ్ చేయడంతో పాటు, వాటిని ఎడిటింగ్ చేసుకునే ఆప్షన్లను కంపెనీ ప్రారంభించింది. వీడియోల కోసం ప్రత్యేకంగా ట్యాబ్‌ను తెచ్చింది. హై క్లారిటీ వీడియోలను అప్‌లోడ్ చేయడంతో పాటు వాటికి పాటలు, ఫిల్టర్‌లు, టెక్స్ట్ యాడ్ చేయడం లాంటి సదుపాయాలను అందించారు. ఈ వీడియో ట్యాబ్‌లో ఇన్‌స్టాగ్రామ్ మాదిరిగా రీల్స్ వస్తాయి. HDRలో వీడియోలను అప్‌లోడ్ చేయడంతో పాటు శక్తివంతమైన కలర్స్, కాంట్రాస్ట్ ఎడిటింగ్ లాంటి ఆప్షన్స్, వాయిస్‌ఓవర్ రికార్డింగ్ మొదలగు ఫీచర్స్‌ను వాడుకుని వీడియోలను అప్‌లోడ్ చేయవచ్చు.
వినియోగదారులు HDR వీడియోలను స్మార్ట్‌ఫోన్‌ల నుండి నేరుగా రీల్స్‌కు అప్‌లోడ్ చేయవచ్చు. వీటితో పాటు, వీడియోల సెర్చింగ్ ఆప్షన్‌ను అప్‌డేట్ చేశారు. దీంతో పాపులర్ లేదా టాపిక్‌ల వారీగా వీడియోలను సెర్చ్ చేయవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ మాదిరిగా ఫేస్‌బుక్‌లో కూడా వీడియోలను తీసుకురావడానికి కంపెనీ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తుంది. కంపెనీ ఫేస్‌బుక్‌లో రీల్స్ పొడవు పరిమితిని 60 సెకన్ల నుండి 90 సెకన్లకు పెంచింది.