మానవరహిత యుద్ధ విమానం.. DRDO మరో మైలురాయి

by Manoj |   ( Updated:2022-07-02 04:49:33.0  )
మానవరహిత యుద్ధ విమానం.. DRDO మరో మైలురాయి
X

దిశ, వెబ్ డెస్క్: భారత డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) మరో మైలురాయి చేరుకుంది. అటానమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ డెమాన్‌స్ట్రేటర్ విమానాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు శుక్రవారం ఒక ప్రకటనలో ప్రకటించింది. ఈ ప్రయోగం కర్ణాటకలోని చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్‌లో జరిపినట్లు DRDO తెలిపింది

ఈ ఫ్లైట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తూ.. "పూర్తి స్వయంప్రతిపత్తి మోడ్‌లో పనిచేస్తున్న ఈ విమానం టేకాఫ్, వే పాయింట్ నావిగేషన్, స్మూత్ టచ్‌డౌన్‌ కలిన విమానం. భవిష్యత్తులో మానవరహిత విమానాల అభివృద్ధికి కీలకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని నిరూపించడంలో ఈ విమానం ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుంది. అటువంటి వ్యూహాత్మక రక్షణ సాంకేతికతలలో స్వావలంబన దిశగా ఒక ముఖ్యమైన అడుగు" అని DRDO తన ప్రకటనలో తెలిపింది.

ఈ నేపథ్యంలో DRDOని అభినందిస్తూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. "చిత్రదుర్గ నుండి అటానమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ డెమోన్‌స్ట్రేటర్ యొక్క మొదటి విమానాన్ని విజయవంతం చేసినందుకు DRDOకి అభినందనలు. క్లిష్టమైన సైనిక వ్యవస్థల పరంగా ఆత్మనిర్భర్ భారత్‌కు మార్గం సుగమం చేసే స్వయంప్రతిపత్త విమానాల విషయంలో ఇది ఒక పెద్ద విజయం" అని ఆయన అన్నారు.

Advertisement

Next Story