ATM పిన్‌లో నాలుగు అంకెలే ఎందుకు ఉంటాయో తెలుసా?

by Jakkula Samataha |
ATM పిన్‌లో నాలుగు అంకెలే ఎందుకు ఉంటాయో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి వ్యక్తి ఏటీఎం కార్డు అనేది వాడుతుంటారు. ప్రతి ఒక్కరి పర్స్‌లో ఉండే అతి ముఖ్యమైన కార్డులో ఇదొక్కటి. ఫోన్ పే, గూగుల్ పే యాప్స్ వాడినా.. ఏటీఎంకు ఉండే స్పెషాలిటీ దానికే ఉంటుంది. ఎందుకంటే మనకు ఎప్పుడైనా అత్యవసరంగా డబ్బులు అవసరం అయితే చాలు దగ్గరిలో ఉండే ఏటీఎం వద్దకు వెళ్లి మనీ తీసుకోవచ్చు. ఒకప్పుడు డబ్బులు తీసుకోవాలంటే తప్పనిసరిగా బ్యాంకుకు వెళ్లాల్సిందే. చాలా సేపు క్యూలో నిల్చొంటే కానీ డబ్బులు రాకపోయేవి. కానీ ఇప్పుడు అలా కాదు, ఏటీఎం, డిజిటల్ పేమెంట్స్ ద్వారా డబ్బులు తీసుకునే ప్రక్రియ చాలా ఈజీ అయిపోయింది.

అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఏటీఎం యూస్ చేయాలంటే తప్పనిసరిగా పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక ఆ పిన్ నాలుగు అంకెలు మాత్రమే ఉంటుంది. మరి అది నాలుగు అంకెలు మాత్రమే ఎందుకు ఉండాలి? ఎక్కువగా ఉండొచ్చుగా ఆలోచించారా? కాగా, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ATM పిన్ నెంబర్ నాలుగు అంకెలు మాత్రమే ఉండడానికి కారణం దీని ఆవిష్కర్త భార్య అంట. ఏటీఎం మెషీన్‌ను జాన షెపర్డ్ బారన్ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు ఆయన పిన్ కోసం ఆరు అంకెలను పెట్టగా, ఆయన సతీమణి ఈ విషయంలో కలగజేసుకొని, ఆరు అంకెల పిన్ చాలా పెద్దగా ఉంది. గుర్తించుకోవడం చాలా కష్టం. అని చెప్పడంతో ఆయన నాలుగు అంకెలకు కుదించాడంట. అలా పిన్ నెంబర్ నాలుగు అంకెలు మాత్రమే ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed