జెమిని AI చాట్‌బాట్‌లో భద్రతా లోపాలు కనుగొన్న సైబర్ నిపుణులు

by Harish |
జెమిని AI చాట్‌బాట్‌లో భద్రతా లోపాలు కనుగొన్న సైబర్ నిపుణులు
X

దిశ, టెక్నాలజీ: టెక్‌ దిగ్గజం గూగుల్‌కు చెందినటువంటి జెమిని AI చాట్‌బాట్‌ అడ్వాన్స్‌డ్ వెర్షన్‌లో సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు భద్రతా లోపాలను కనిపెట్టారు. యాప్ సబ్‌స్క్రయిబ్ చేసిన వినియోగదారుల వ్యక్తిగత డేటా లీక్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సైబర్‌ సెక్యూరిటీ పరిశోధకులైన HiddenLayer నుండి వచ్చిన ఒక నివేదిక ప్రకారం, Google Workspace లేదా జెమిని APIతో జెమిని అడ్వాన్స్‌డ్‌ను వాడినప్పుడు చాట్‌బాట్ అనుకోకుండా పాస్‌వర్డ్‌లతో పాటు, వ్యక్తిగత డేటాను లీక్ చేయగలదని నిపుణులు కొనుగొన్నారు. అలాగే, జెమిని చాట్‌బాట్ తప్పుడు సమాచారం లేదా హానికరమైన కంటెంట్‌ను అందించే అవకాశం ఉందని వారు తెలిపారు.

దీని ద్వారా ఖచ్చితమైన సమాచారం, ఇతర సహాయం కోసం చాట్‌బాట్‌పై ఆధారపడే వినియోగదారులకు తప్పుడు డేటా పొందే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో చాట్‌బాట్‌లో వచ్చిన సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు గూగుల్ తెలిపింది. ఇటీవల కంపెనీ నుంచి వచ్చిన ఇమేజ్ జనరేషన్ టూల్ కూడా వివాదాస్పదం అయింది, దీంతో దాని సేవలు నిలిపివేశారు. AI- పవర్డ్ టూల్స్ పట్ల చాలా మంది నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూజర్ల డేటాను రక్షించి, ఖచ్చితమైన సమాచారాన్ని అందించడానికి సంబంధిత వర్గాలు ఇంకా తీవ్రంగా కృషి చేయాలని వారు అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed