ఒకే వాట్సాప్ చాటింగ్ రెండు స్మార్ట్‌ఫోన్లలో చూసే కొత్త ఫీచర్

by Harish |
ఒకే వాట్సాప్ చాటింగ్ రెండు స్మార్ట్‌ఫోన్లలో చూసే కొత్త ఫీచర్
X

దిశ, వెబ్‌డెస్క్: మెసేజింగ్ యాప్ వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. దీని పేరు ‘కంపానియన్ మోడ్’. Android బీటా టెస్టర్ల కోసం ఈ ఫీచర్‌ను విడుదల చేశారు. వాట్సాప్‌ను అదనంగా వేరే డివైజ్‌లతో కనెక్ట్ చేయడానికి ఉపయెగపడే విధంగా కొత్త ఆప్షన్‌ను కంపెనీ తీసుకొచ్చింది. మొదటి డివైజ్‌లో చాట్‌ను వేరే డివైజ్‌లలో చూడటానికి వాట్సాప్ లింక్ డివైజ్‌ ఆప్షన్‌ను ఎంచుకుని, వేరే డివైజ్‌లో వాట్సాప్ ను ఓపెన్ చేసి స్కానర్ ద్వారా మొదటి డివైజ్ వాట్సాప్‌లో ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేయాలి. అయితే ప్రస్తుతానికి ఇది ఆండ్రాయిడ్ వెర్షన్ 2.23.8.2 బీటా టెస్టర్‌లకు అందుబాటులో ఉంటుంది. చాట్ ఖాతాలను ఒకటి కంటే ఎక్కువ స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్‌లలో యాక్సెస్ చేయడానికి అనుమతించే ఫీచర్ వినియోగదారులకు బాగా ఉపయోగపడుతుందని, అన్ని టెస్టింగ్‌లు పూర్తయ్యాక త్వరలో అందరికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed