- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీ ఫోన్ హ్యాక్ అయిందేమోనని భయపడుతున్నారా..? ఎంత పెద్ద స్కామ్ అయిన ఈ కోడ్స్‌తో చెక్
దిశ, వెబ్‌డెస్క్: ఇప్పుడు టెక్నాలజీ ఎంతో డవలప్ అవుతోంది. ఒక్క ఫోన్‌తో కూర్చున్న ప్లేస్‌లోకే అన్ని దగ్గరకు వస్తున్నాయి. ఈ కాలంలో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్లు ద్వారానే అన్ని పేమెంట్స్ జరుపుతున్నారు. అంతే కాకుండా బ్యాంకుల వివరాలు, లావాదేవీలు, పర్సనల్ ఫొటోలు, వీడియోలు, కాల్స్ ఇలా అన్ని తమ ఫోన్‌లలో బద్రపరుచుకుంటున్నారు. దీన్నే క్యాష్ చేసుకుంటున్నారు హ్యాకర్లు. యూజర్ల సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి ప్రయత్నించి వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇలాంటి దాడులు ఈ మధ్యకాలంలో ఎక్కువ కావడంతో ఫోన్‌లు వాడేందుకు కూడా భయపడుతున్నారు. తమ ఫోన్లు కూడా హ్యాక్ అయ్యాయేమో అని అనుమానపడుతున్నారు. అయితే.. తమ ఫోన్లు హ్యాక్ అయ్యాయో లేదో తెలుసుకోవడానికి రీసెంట్‌గా నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (NCIB) ట్విట్టర్‌లో ఏడు USSD కోడ్స్‌ను తెలియజేసింది. అవి ఏంటో తెలుసుకుందాం..
*#21# : మనకు తెలియకుండానే కాల్స్, మెసేజ్‌లు మరొక నెంబర్‌కు ఫార్వర్డ్ అవుతూ ఉంటే *#21# ఈ కోడ్ ద్వారా ఆ విషయాన్ని తెలుసుకోవచ్చు. కాల్ ఫార్వర్డింగ్ స్కామ్‌ల బారిన పడ్డామో లేదో అని విషయాన్ని తెలుసుకోవడానికి మీ మొబైల్‌లో డైలీ ఈ కోడ్‌ను చెక్ చేస్తూ ఉండండి.
*#07# : ఈ కోడ్ ఫోన్ SAR (స్పెసిఫిక్ అబ్సర్ష్పన్ రేట్) వాల్యూ చూపుతోంది. ఇది ఫోన్‌ని ఉపయోగించనప్పుడు యూజర్ శరీరం ఎంత రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీని అబ్‌సార్బ్ చేస్తుందో చెప్పే ఒక మెజర్మెంట్. అంటే స్పెసిఫిక్ అబ్సర్ష్పన్ రేట్ ఎంత తక్కువ ఉంటే, ఫోన్ వాడే యూజర్ ఆరోగ్యం అంత సురక్షితమైనది.
#0# : ఈ కోడ్ ద్వారా ఫోన్‌లో హిడెన్ మెనూని ఓపెన్ చేయవచ్చు. ఇందులో డిస్‌ప్లే, స్పీకర్, కెమెరా, సెన్సార్‌ల ఫంక్షనాలిటీని టెస్ట్ చేయవచ్చు.
*#06# : ఈ కోడ్ ఫోన్ IMEI (ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ) నంబర్‌ను డిస్‌ప్లే చేస్తుంది. ఇది ఫోన్‌ను గుర్తించే యూనిక్ 15-డిజిట్ నెంబర్. ఫోన్ పోయినా లేదా దొంగిలించబడిన వేరే వాళ్లు మన ఫోన్ ఉపయోగించకుండా బ్లాక్ చేయడానికి ఈ నెంబర్ ఉపయోగపడుతోంది.
4636## : ఇది ఫోన్ బ్యాటరీ, ఇంటర్నెట్, Wi-Fi సెట్టింగ్స్ గురించి సమాచారాన్ని అందిస్తుంది.
34971539## : ఇది ఫోన్ కెమెరా క్వాలిటీ, రిజల్యూషన్‌ని చెక్ చేయడానికి ఉపయోగపడుతోంది.
2767*3855# : ఫోన్‌లోని మొత్తం డేటా, సెట్టింగ్స్‌ను ఇది ఎరేజ్ చేస్తుంది. కాబట్టి దీనిని అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించాలి. అంతే కాకుండా.. మీ ఫోన్‌ను విక్రయించే ముందు డేటాను తుడిచి వేయడానికి ఉపయోగించవచ్చు.