- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్’ ప్రోగ్రాంను ప్రారంభించిన యాపిల్
దిశ, టెక్నాలజీ: ప్రపంచదిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ యాపిల్ విద్యార్థులకు టెక్నాలజీపై ఆసక్తిని పెంపొందించడానికి ‘స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్ 2024’ ప్రోగ్రాంను ప్రారంభించింది. ప్రస్తుతం దీనిలో పాల్గొనడానికి దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఈ ప్రోగ్రాంలో పాల్గొనే వారికి యాపిల్ ఒక టాస్క్ ఇస్తుంది. దాన్ని వారు పూర్తి చేయాల్సి ఉంటుంది. గెలిచిన వారికి కంపెనీ తమ ఆఫీసును సందర్శించే అవకాశాన్ని అందిస్తుంది. ప్రతి ఏడాది యాపిల్ ఈ విధమైన ప్రోగ్రాంను నిర్వహిస్తుంది. విద్యార్థుల్లో టెక్నాలజీకి సంబంధించిన అంశాలను పెంపొందించుకోవడానికి, అలాగే నిపుణులతో కలిసి పనిచేయడానికి వారికి తోడ్పాటు అందిస్తుంది.
2024లో జరిగే ఈ పోటీలో తదుపరి తరం సంచలనాత్మక యాప్‌లను క్రియేట్ చేయడానికి విద్యార్థులు, ప్రొఫెషనల్స్ ఉపయోగించే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌పై పనిచేయాల్సి ఉంటుంది. స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్‌లో మొత్తంగా 350 మంది విజేతలను ఎంపిక చేస్తారు. వారిలో 50 మందిని ప్రత్యేకంగా కాలిఫోర్నియాలోని కుపెర్టినోలో ఉన్న యాపిల్ హెడ్ ఆఫీస్‌ను సందర్శించే అవకాశాన్ని అందిస్తున్నారు. విజేతలందరూ యాపిల్ డెవలపర్ ప్రోగ్రామ్‌లో ఒక సంవత్సరం ఉచితంగా సభ్యత్వం పొందుతారు. ఇంకా, కంపెనీ నుండి ప్రత్యేక బహుమతిని అందుకుంటారు.
- Tags
- Apple