అభిమాని చేసిన పనికి షాక్ అయిన ఆపిల్ సీఈఓ.. ఇంతకి ఏంటంటే!

by Harish |   ( Updated:2023-04-23 12:49:54.0  )
అభిమాని చేసిన పనికి షాక్ అయిన ఆపిల్ సీఈఓ.. ఇంతకి ఏంటంటే!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియా మొట్టమొదటి ఆపిల్ స్టోర్‌ను ప్రారంభించిన సీఈఓ టిమ్ కుక్, ఈ సందర్భంగా ఓ అరుదైన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఈ వేడుకలో ఓ అభిమాని 1984 నాటి ఆపిల్ కంప్యూటర్‌‌ను ఆయనకు చూపించారు. దీంతో టిమ్ కుక్ సర్‌ప్రైజ్ అయ్యారు. పాత కాలం నాటి Macintosh క్లాసిక్ కంప్యూటర్‌ ఆపిల్ సంస్థ అభివృద్ధిని చూపిస్తోందని ఆ అభిమాని తెలిపాడు. ఈ కంప్యూటర్‌ను చూసి ఆశ్చర్య పోయిన కుక్ ఆ అభిమానిని హత్తుకున్నారు. మంగళవారం(18 ఏప్రిల్‌ 2023) ముంబైలో అధికారిక మొట్టమొదటి ఆపిల్ స్టోర్‌ను ఆ సంస్థ సీఈఓ టిమ్ కుక్ ప్రారంభించారు. రెండో స్టోర్‌ గురువారం(20న) దిల్లీలో ప్రారంభం కానుంది.

Advertisement

Next Story