SmartPhone Discounts: ఈ ఆఫర్‌ మళ్లీ రాదు భయ్యా.. తక్కువ ధరకే అదిరే మొబైల్స్.. డిస్కౌంట్‌లు ఇవే

by Vennela |
SmartPhone Discounts: ఈ ఆఫర్‌ మళ్లీ రాదు భయ్యా.. తక్కువ ధరకే అదిరే మొబైల్స్.. డిస్కౌంట్‌లు ఇవే
X

SmartPhone Discounts: మీ బడ్జెట్లో మంచి స్మార్ట్ ఫోన్(SmartPhone) కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అది కూడా రూ. 10, 000 కంటే తక్కువ ధరకే ఉండాలని సెర్చ్ చేస్తున్నారా. అయితే మీకోసమే ఈ వార్త. ఎందుకంటే అమెజాన్(amazon) లో జనవరి 15 నుంచి గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ప్రారంభం అయ్యింది. ఈ సేల్ లో స్ట్రాంగ్ ఫీచర్స్ ఉన్న ఫోన్లను రూ. 10వేల లోపు ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్ లో టాప్ 3 డీల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చాలా తక్కువ ధరలో ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ జబితాలో కేవలం రూ. 6, 249 ధర ఉన్న శాంసంగ్ ఫోన్ కూడా ఉంది.

నేటి నుంచి జనవరి 19 వరకు జరిగే ఈ సేల్ లో 9వేల రూపాయల కంటే తక్కువకు 5జీ స్మార్ట్ ఫోన్(5g SmartPhone) ను కొనుగోలు చేయవచ్చు. సేల్ లో ఎక్స్చేంజ్ బోనస్(Exchange Bonus) కూడా అందుబాటులో ఉంటుంది. ఎక్స్చేంజ్ ఆఫర్ లో లభించే డిస్కౌంట్ మీ పాత్ ఫోన్, బ్రాండ్, కంపెనీ ఎక్స్చేంజ్ పాలసీ పద్దతి(Company Exchange Policy Methodology)పై ఆధారపడి ఉంటుంది.

టెక్నో పాప్ 9 5జీ:(Tecno Pop 9 5G)

ఈ 5జీ స్మార్ట్ ఫోన్ ధర రూ. 9,499. ఈ సేల్ పై రూ. 750 కూపన్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఎస్బిఐ క్రెడిట్ కార్డుతో చెల్లించే యూజర్లకు రూ. 1,000 వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ తో పాటు కంపెనీ సుమారు రూ. 474 క్యాష్ బ్యాక్ ను కూడా అందిస్తోంది. ఎక్స్చేంజ్ ఆఫర్ లో రూ. 9, 000 వరకు పొందవచ్చు. ఈ ఫోన్ లో డైమెన్సిటీ 6300 5జీ ప్రాసెసర్, 48 మెగాపిక్సెల్ సోనీ ఏఐ కెమెరా కూడా ఉంటుంది.

లావా ఓ 3 (Lava O3)

4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో లావా ఓ3 వస్తుంది. ఈ ఫోన్ అమెజాన్ ఇండియాలో రూ. 6,199కి అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్ లో మీరు దాన్ని ధరను 10శాతం వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్ పై రూ. 5,850 వరకు ఎక్స్చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. రూ. 310 వరకు బ్యాక్ ను కంపెనీ అందిస్తోంది. 8జీబీ వరకు ర్యామ్ ను ఈ ఫోన్ సపోర్టు చేస్తుంది. దీనిలో 6.75అంగుళాల పంచ్ హోల్ హెచ్డీ ప్లస్ డిస్ల్పే ను అందించింది. ఫోన్ మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్ ఉండగా సెల్ఫీ కెమెరా 5 మెగాపిక్సెల్ ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఎం 05 (Samsung Galaxy M05)

4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీతో శాంసంగ్ గెలాక్సీ ఎం 05 ఫోన్ రూ. 6,249 ధరకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ పై సుమారు రూ. 312 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఎక్స్చేంజ్ ఆఫర్ లో దీని ధరను రూ. 5,900 వరకు తగ్గించుకోవచ్చు. ఫీచర్లు చూస్తే ఇందులో 6.7 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ ప్లేను కంపెనీ అందిస్తోంది. ఫోన్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని దీనిలో అందించారు.

Advertisement

Next Story

Most Viewed