వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. హ్యాకర్లు మీ అకౌంట్లను ఎలా హ్యాక్ చేస్తారంటే?

by D.Reddy |   ( Updated:2025-03-18 07:00:01.0  )
వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. హ్యాకర్లు మీ అకౌంట్లను ఎలా హ్యాక్ చేస్తారంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు వాట్సాప్‌ను టార్గెట్ చేశారు. వాట్సాప్ హ్యాక్ చేసి పలు నేరాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో ఈ వాట్సాప్‌‌‌‌‌‌‌‌ హ్యాకింగ్ పెరిగిపోవడంతో సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఫోన్లు, వాట్సాప్‌‌‌‌‌‌‌‌ హ్యాకింగ్‌‌‌‌‌‌‌‌ కాకుండా సెక్యూరిటీ సెట్టింగ్స్‌‌‌‌‌‌‌‌ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ సందర్భంగా అసలు హ్యాకర్లు మన వాట్సాప్ అకౌంట్లను ఎలా హ్యాక్ చేస్తారో ఇక్కడ తెలుసుకుందాం.

ఎలా హ్యాక్ చేస్తారంటే..

OTP ఫిషింగ్: సాధారణంగా స్కామర్లు వాట్సాప్ సపోర్టు టీంగా లేదా అధికారిగా యూజర్లకు ఫోన్ చేసి నమ్మిస్తారు. తర్వాత 6 అంకెల otpని చెప్పమంటారు. పొరపాటున చెప్పేస్తే అంతే సంగతి.

వాట్సాప్ వెబ్ హైజాకింగ్: హ్యాకర్లు యూజర్ ఫోన్‌కు బ్రీఫ్‌గా యాక్సెస్ చేస్తారు. వాట్సాప్‌ను వాట్సాప్ వెబ్‌కు లింక్ చేస్తారు. రిమోట్ యాక్సెస్‌ చేస్తారు.

కాల్ మెర్జింగ్ స్కామ్: స్కామర్లు యూజర్లకు కాల్ చేసి మెర్జ్ చేయమంటారు. యూజర్లకు అనుమానం రాకుండా వారి కాల్‌ను ఆటోమేటెడ్ వాట్సాప్ otp వెరిఫికేషన్ కాల్‌కి కనెక్ట్ చేస్తాడు. ఆ తర్వాత otp విని అకౌంట్‌ను కంట్రోల్ చేస్తాడు.

హ్యాకర్ల నుంచి ఎలా ప్రొటెక్ట్ చేయాలంటే..

* వాట్సాప్ సెట్టింగ్స్‌లో టూ-ఫ్యాక్టర్డ్ అథెంటికేషన్ (Two-factor authentication)ని ఎనేబుల్ చేయాలి. అకౌంట్ సేఫ్టీ కోసం అదనంగా సెక్యూరిటీ పిన్‌ సెటప్ చేసుకోవాలి.

* వాట్సాప్ నుంచి ఎలాంటి అధికారులు ఫోన్ చేసి otp అడగరు. ఎవరైనా కాల్ చేసి otp చెప్పమని అడిగినా కూడా షేర్ చేయకూడదు.

* వాట్సాప్ వెబ్ సెషన్‌లను తరచూగా చెక్ చేసుకోవాలి. వాట్సాప్ సెట్టింగ్స్‌లో Linked Devices వెళ్లి గుర్తుతెలియని డివైజ్‌ల నుంచి లాగ్ అవుట్ అవ్వాలి.

* ఐఫోన్ యూజర్లు అయితే Lockdown Modeని యాక్టివేట్ చేసుకుంటే.. అనధికార డివైజ్ లింక్‌ను అనుమతించదు.

* అలాగే, అనుమానాస్పద మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. తెలియని నంబర్‌లతో కాల్స్ ఎప్పుడూ మెర్జ్ చేయవద్దు.


Read More..

వారంలో మానాల్సిన గాయం.. కేవలం 4 గంటల్లో మానేలా జెల్! శాస్త్రవేత్తల అద్భుత సృష్టి

Next Story

Most Viewed