Lava నుంచి Agni 2 5G స్మార్ట్ ఫోన్

by Harish |
Lava నుంచి Agni 2 5G స్మార్ట్ ఫోన్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ కంపెనీ లావా నుంచి కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్ త్వరలో భారత మార్కెట్లోకి రానుంది. ఈ మోడల్ పేరు ‘లావా అగ్ని 2 5G’, దీని ధర సుమారు రూ. 20,000. మే చివరి నాటికి భారత మార్కెట్లోకి విడుదల కావచ్చని సమాచారం. Lava Agni 2 5G స్మార్ట్ ఫోన్ MediaTek డైమెన్సిటీ 7050 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. ఫోన్ గురించి వచ్చిన ముందస్తు లీక్‌ల ప్రకారం. ఫోన్ 6.5-అంగుళాల (1600 x 900) డిస్‌ప్లే కలిగి ఉండవచ్చు. AMOLED డిస్‌ప్లే ప్యానెల్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుందని నివేదిక పేర్కొంది. ప్రాథమిక వెనుక కెమెరా 50-మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. 8GB RAM, 256GB స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇతర పూర్తి వివరాలు లాంచ్ టైం లో తెలుస్తాయి.




Advertisement

Next Story