గర్భం దాల్చిన మహిళ.. ముందే అలర్ట్ చేసిన వాచ్‌!

by Nandhaamani |   ( Updated:2023-03-23 15:30:17.0  )
గర్భం దాల్చిన మహిళ.. ముందే అలర్ట్ చేసిన వాచ్‌!
X

దిశ, వెబ్‌డెస్క్: అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ అన్ని రంగాల్లో కీలక మార్పులను తీసుకొస్తుంది. ముఖ్యంగా వైద్య రంగంలో మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ కారణాలతో మార్కెట్‌లోస్మార్ట్‌ వాచ్‌ లకు డిమాండ్‌ కనిపిస్తోంది. ఇప్పుడు స్మార్ట్‌ వాచ్‌(Smart watch)లు హెల్త్‌ ట్రాకింగ్‌ ఫీచర్‌(Health tracking feature)లపై ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. వీటితో శరీరంలో జరిగే అనూహ్య మార్పులను సులువుగా గుర్తించే అవకాశం దక్కుతోంది. ఈ తరహాలోనే ఓ మహిళ గర్భం (pregnancy) దాల్చిన విషయాన్ని ముందుగా యాపిల్‌ వాచ్‌ (Apple Watch) గుర్తించింది.

గర్భం దాల్చిన విషయం తాను గుర్తించక ముందే యాపిల్‌ వాచ్‌ సూచించిందని ఓ మహిళ పేర్కొంది. ఆమె వయసు 34 సంవత్సరాలు. తన యావరేజ్‌ రెస్టింగ్‌ హార్ట్‌ రేట్‌ కొన్ని రోజులలో గణనీయంగా పెరిగినట్లు యాపిల్‌ వాచ్‌ చూపించిందని ఆమె తెలిపారు. యావరేజ్‌ రెస్టింగ్‌ హార్ట్‌ రేట్‌ పెరగడం చూసి శరీరంలో ఏవో మార్పులు జరిగినట్లు అనుమానించినట్లు రెడ్డిట్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు.

యూకే(UK)కు చెందిన ఒక వ్యక్తి ప్రాణాలను యాపిల్ వాచ్ కాపాడింది. బెడ్ ఫోర్ట్ షైర్ లోని ప్లిట్ విక్ లో నివాసం ఉండే ఆడమ్ క్రాప్ట్(36) అనే వ్యక్తి తాను ధరించిన యాపిల్ వాచ్ గుండె కొట్టుకునే విధానం సాధారణంగా లేదని రాత్రంతా హెచ్చరిస్తూ నోటిఫికేషన్ ఇచ్చిందట. దాంతో ఆ వ్యక్తి ఆసుపత్రికి వెళ్ళగా అతని గుండెలో బ్లాక్ ఉన్నట్లు వైద్యులు గుర్తించి చికిత్స అందించారు. ఇలా డాక్టర్ కంటే ముందే స్మార్ట్ వాచ్‌లు మానవుని ఆరోగ్యాన్ని అంచనా వేసి ప్రమాదాలను గుర్తిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి : తక్కువ ధరలో మరో కొత్త స్మార్ట్ వాచ్ లాంచ్.. ఫీచర్స్ ఇవే!

Advertisement

Next Story