ప్రతి ఫోన్‌లో ఈ నెంబర్‌ ఉండాల్సిందే.. లేదంటే అంతే సంగతి..

by Sumithra |   ( Updated:2024-10-11 14:54:13.0  )
ప్రతి ఫోన్‌లో ఈ నెంబర్‌ ఉండాల్సిందే.. లేదంటే అంతే సంగతి..
X

దిశ, వెబ్ డెస్క్ : కాలం మారింది, టెక్నాలజీ పెరిగింది. వాటితో పాటు సైబర్‌ నేరాలు సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా ఎక్కడ చూసినా చాలామంది ఈ మోసగాళ్ల చేతిలో బలవుతున్నారు. అప్డేట్ గా ఉన్న సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త వ్యూహం పన్ని వందల సంఖ్యలో జనాలను మోసం చేస్తున్నారు. ఓ వైపు ఆన్‌లైన్‌ షాపింగ్‌లు, డిజిటల్‌ చెల్లింపులు ఎలా పెరుగుతున్నాయో అలాగే సైబర్ నేరాల సంఖ్య కూడా పెరిగిపోతుంది. ఇలాంటి మోసాల బారిన పడకుండా, అకౌంట్లో ఉన్న డబ్బులు సేఫ్ గా ఉండాలన్నా ప్రతి ఒక్కరు కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి, అలాగే కొన్ని జాగ్రత్తలు కూడా వహించాలి. అలాగే ప్రతి మొబైల్ లోనూ ఓ నెంబర్‌ కచ్చితంగా ఉండాల్సిందే. మరి ఆ నంబర్ ఏంటి, వివరాలేంటి, దాంతో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏ ప్రాంతం వారైనా సైబర్ నేరాల బారిన పడకుండా, కోల్సోయిన డబ్బును తిరిగి పొందాలన్నా దానికోసం కొన్ని ప్రత్యేక మార్గాఉన్నాయంటున్నారు సైబర్‌ నిపుణులు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు మొదలుకుని కేంద్ర ప్రభుత్వాల వరకు , అలాగే సాధారణ బ్యాంకుల నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరకు అధికారులందరూ అవగాహన కల్పిస్తున్నారు.

అలాగే అకౌంట్ లో నుంచి డబ్బులు తీసినట్టు మెసేజ్ లు వచ్చినా అనిపించినా వెంటనే ఒక పని చేయాలని చెబుతున్నారు నిపుణులు చెబుతున్నారు. అలాగే సైబర్ మోసాల నుంచి జనాలను తమని తాము రక్షించడానికి మినిస్ట్రీ అఫ్ హోమ్ అఫైర్స్ హెల్ప్లైన్, గవర్నమెంట్ అఫ్ ఇండియా నంబర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఆ నండర్ ఏంటి అంటే 1930 నెంబర్‌. మీ బ్యాంక్ అకౌంట్‌ నుంచి అనధికారికంగా ఎవరైనా డబ్బులు ట్రాన్సాక్షన్‌ జరిగితే ఇట్టే వెంటనే 1930 నెంబర్‌కు ఫోన్‌ చేయాలి. ఫిర్యాదును అందుకున్న వెంటనే ట్రాన్సాక్షన్‌ను ఆపుతారు. దీంతో మీ డబ్బులు ఎక్కడికి పోకుండా అకౌంట్లోనే సేఫ్ గా ఉంలాయి.

అలాగే ఫిర్యాదును cybercrime.gov.in వెబ్ సైట్ లో కూడా భేషుగ్గా నమోదు చేసుకోవచ్చు. ఆన్ లైన్ పేమెంట్స్‌ చేస్తున్నప్పుడు ఏవూనా లోపాలు జరిగినా లేకపోతే సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్లు అనిపించినా వెంటనే ఫిర్యాదు చేయాలి. అందుకే ప్రతీ ఒక్కరి చరవాణిలో ఈ నెంబర్‌ను కచ్చితంగా సేవ్ చేసుకుని ఉండాలని సూచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed