Health : గంటలో మెదడు క్యాన్సర్‌ను గుర్తించనున్న కొత్త పరికరం.. అదేంటో చూసేద్దామా..

by Sumithra |
Health : గంటలో మెదడు క్యాన్సర్‌ను గుర్తించనున్న కొత్త పరికరం.. అదేంటో చూసేద్దామా..
X

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : క్యాన్సర్ దీని పేరు వింటే చాలు గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఇటీవలి కాలంలో క్యాన్సర్ మరణాల రేటు కూడా ఎక్కువగా పెరిగిపోతున్నాయంటేనే అర్ధం అవుతుంది ఇది ఎంత భయంకరమైన వ్యాధినో. శరీరంలోని కణాల అనియంత్రిత పెరుగుదల వల్ల క్యాన్సర్ వ్యాధి వ్యాపిస్తుంది. శరీరంలోని ఏదైనా భాగంలో కణాలు అనియంత్రితంగా పెరగడం ప్రారంభించినప్పుడు క్యాన్సర్ ఏర్పడటం ప్రారంభమవుతుంది. కొన్ని సందర్భాలలో క్యాన్సర్ లక్షణాలు చాలా ఆలస్యంగా బయట పడుతున్నాయి. అలాంటి సమయంలో రోగి ప్రాణాలను రక్షించడం అతి కష్టంగా మారుతుంది. కానీ నేడు అన్ని రకాల క్యాన్సర్లను గుర్తించడం చాలా సులభతరం అయ్యింది. కొన్ని వైద్య పరీక్షల సహాయంతో ఆ భాగంలోని కణాల నిర్మాణాన్ని తెలుసుకుని, శరీరంలో క్యాన్సర్ ఉంటుందా లేదా అనేది సులభంగా తెలుసుకోవచ్చు.

మెదడు క్యాన్సర్ కోసం కొత్త రక్త పరీక్ష..

మెదడు క్యాన్సర్ ను కనుగొనేందుకు కొత్త పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. ఒక్క పరీక్ష సహాయంతో మెదడు కణాల పెరుగుదలను పర్యవేక్షించడం సులభం అవుతుంది. ఈ పరీక్ష వల్ల మెదడు క్యాన్సర్‌ని గంటలోపే గుర్తించవచ్చు. దీంతో ఈ క్యాన్సర్ ని త్వరగా నివారించవచ్చు.

అమెరికాలో మెదడు క్యాన్సర్‌ పై పరిశోధన..

ఈ పరీక్షను అమెరికాలోని నోట్రే డేమ్ యూనివర్సిటీ పరిశోధకుల బృందం చాలా సంవత్సరాల పాటు కష్టపడి కనుగొన్నారు. ఇందులో భాగంగానే వారు రక్త పరీక్ష పరికరాన్ని అభివృద్ధి చేశారు. దాని సహాయంతో మెదడు క్యాన్సర్‌ను ఒకే పరీక్ష సహాయంతో సులభంగా గుర్తించవచ్చంటున్నారు. ఈ పరికరం గ్లియోబ్లాస్టోమాను ముందుగా గుర్తించడం కోసం రూపొందించారు. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్ది జనాలు మెదడు క్యాన్సర్ కారణంగా మృత్యువాత పడుతున్నారు. ఈ పరికరం సహాయంతో రక్తం నమూనా నుండి ఒక గంటలోపు దాని లక్షణాలను గుర్తించవచ్చు.

గ్లియోబ్లాస్టోమా ప్రమాదకరమైన మెదడు క్యాన్సర్...

గ్లియోబ్లాస్టోమా అనేది మెదడు క్యాన్సర్‌లో అత్యంత ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన రకంగా చెబుతున్నారు నిపుణులు. ఈ క్యాన్సర్‌ను గుర్తించిన తర్వాత రోగి 12-18 నెలలు మాత్రమే జీవించి ఉంటాడట. ఇప్పటి వరకు ఈ క్యాన్సర్‌ను గుర్తించడానికి బయాప్సీ చేసేవారు. దీనిలో కణితి నుండి కణజాల నమూనాను తీసుకొని పరిశీలించారు. కానీ ఇప్పుడు ఈ రక్త పరీక్ష ఈ క్యాన్సర్‌ను గుర్తించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

బయోచిప్ సహాయంతో పరీక్ష..

ఈ పరికరంలో చిన్న బయోచిప్ సహాయంతో పరీక్ష జరుగుతుంది. ఈ చిప్‌లోని పరీక్ష ఎలక్ట్రో-కైనెటిక్ సెన్సార్‌ని ఉపయోగిస్తారు. కణాలలో క్యాన్సర్ సంబంధిత బయోమార్కర్‌లు ఉన్నాయో లేదో అని సెన్సార్ గుర్తిస్తుంది. దీనిని ఎపిడెర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టర్లు అంటారని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. భవిష్యత్తులో మెదడు క్యాన్సర్‌ను గుర్తించడంలో ఇది పెద్ద పాత్ర పోషిస్తుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ పరికరం ద్వారా మెదడు క్యాన్సర్ మాత్రమే కాకుండా ఇతర క్యాన్సర్లు, హృదయ సంబంధ వ్యాధులు, చిత్తవైకల్యం, మూర్ఛలను కూడా గుర్తించేందుకు ఉపయోగకరంగా ఉంటుందని పరిశోధకులు ఆశిస్తున్నారు.

గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story