బయటపడ్డ అలనాటి అవశేషాలు.. 200 ఏండ్ల కిందట ఏం జరిగిందంటే..

by Disha Web Desk 20 |
బయటపడ్డ అలనాటి అవశేషాలు.. 200 ఏండ్ల కిందట ఏం జరిగిందంటే..
X

దిశ, ఫీచర్స్ : పూర్వం ప్రజలను పాలించేందుకు రాజులు, అడవిని పాలించేందుకు సింహం రాజు ఉన్నట్టు, సముద్రాన్ని పాలించేందుకు సముద్రపు రాక్షసుడు ఉండేవాడట. అలాంటి సముద్రపు రాక్షసుడి అవశేషాలను ఇప్పుడు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది ఇప్పటివరకు కనుగొన్న వాటిలో అతిపెద్ద సముద్ర సరీసృపాలు కూడా కావచ్చంటున్నారు. ఈ జీవిని ఇచ్థియోసార్ లేదా 'సముద్ర బల్లి' అని పిలుస్తారట. ఇది మొసోజోయిక్ శకంలోని ముఖ్యమైన సముద్ర మాంసాహారులలో ఒకటని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. మోసోజోయిక్‌ను డైనోసార్ల యుగం అని కూడా పిలుస్తారు. అయితే ఇచ్థియోసార్‌లు డైనోసార్‌లు కాదు. 200 మిలియన్ సంవత్సరాల క్రితం సోమర్సెట్ తీరప్రాంతం జెయింట్ ఇచ్థియోసార్లకు నిలయంగా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఇప్పటి వరకు నీలి తిమింగలాన్ని నీటిలో ఉన్న అతిపెద్ద జంతువుగా పరిగణించారు. దీని పొడవు 33.5 మీటర్లు (అంటే 110 అడుగులు). కానీ మిలియన్ల సంవత్సరాల నాటి ఇచ్థియోసార్ అవశేషాలు పరిమాణం పరంగా బ్లూ వేల్‌కు పోటీగా ఉన్నాయి.

ప్రస్తుతం కనుగొన్న ఇచ్థియోసార్ దవడ ఎముక పొడవుగా ఉందని, దంతాల వెనుక దిగువ దవడ పైభాగంలో వక్రంగా ఉందని పరిశోధకులు తెలిపారు. దీని పొడవు రెండు మీటర్ల కంటే ఎక్కువ అంటే 6.5 అడుగులు ఉండవచ్చంటున్నారు. ఈ భారీ సముద్రపు బల్లి 25 మీటర్ల కంటే ఎక్కువ అంటే 82 అడుగుల పొడవు ఉండేదని పరిశోధకులు భావిస్తున్నారు.

అవశేషాలను కనుగొన్న 11 ఏళ్ల బాలిక..

ఇంగ్లాండ్‌లోని బ్రౌంటన్‌కు చెందిన జస్టిన్, రూబీ రేనాల్డ్స్ సోమర్‌సెట్‌లోని బ్లూ యాంకర్‌లో శిలాజాల కోసం వెతుకుతున్నప్పుడు ఈ సముద్ర జీవిని కనుగొన్నారు. మే 2020లో వారు ఇచ్థియోసార్ దవడ ఎముక మొదటి శకలాన్ని పొందారు. అప్పుడు 11 ఏళ్ల రూబీ మొదటి ఎముక ముక్కను చూసింది. దీని తర్వాత ఆమె తండ్రి మరిన్ని ముక్కలను కనుగొన్నాడు. ఇటీవల ఈ పరిశోధనకు సంబంధించిన ఫలితాలు ప్లోస్ వన్ జర్నల్‌లో ప్రచురించారు.

Next Story

Most Viewed