- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టెక్ మహీంద్రా లాభాలు 17 శాతం డౌన్
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చితో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 17.4 శాతం క్షీణించి రూ. 1,081 కోట్లుగా వెల్లడించింది. అంతకుముందు డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 1,309.8 కోట్ల లాభాలను నమోదు చేసింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం త్రైమాసిక ప్రాతిపదికన 0.9 శాతం పెరిగి రూ. 9,729.9 కోట్లుగా నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో కంపెనీ నిర్వహణ లాభం 2.8 శాతం పెరిగి రూ. 1,948 కోట్లకు చేరుకుంది. కంపెనీ బోర్డు ఇదివరకు ఒక్కో షేర్‌కు రూ. 15 ప్రత్యేక డివిడెండ్‌తో పాటు రూ. 15 తుది డివిడెండ్‌ను, అదనంగా రూ. 15 ప్రత్యేక డివిడెండ్‌ను ఆమోదించింది.
ఐటీ సేవల ఆదాయం 1 శాతం వృద్ధితో రూ. 8,673 కోట్లను, బీపీఓ విభాగం ఆదాయం రూ. 1,056.9 కోట్లను నమోదు చేసినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ‘అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలపై నిరంతరం దృష్టి సారిస్తున్నాం. మార్చి త్రైమాసికంలో భారీ ఒప్పందాలతో క్లయింట్లతో ఎంగేజ్ అవుతున్నాం. బలమైన డిమాండ్‌ను కొనసాగిస్తున్నమని’ టెక్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సీపీ గుర్నాని చెప్పారు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కంపెనీ ఆదాయం 2.7 శాతం పెరిగి రూ. 37,855 కోట్లకు చేరుకుంది. లాభాలు 9.8 శాతం వృద్ధితో రూ. 4,428 కోట్లుగా వెల్లడించింది. కాగా, ఆర్థిక ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేర్ సోమవారం 2.1 శాతం లాభపడి రూ. 970 వద్ద ట్రేడయింది.