- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దళిత నేతకు కన్నీటి వీడ్కోలు..
దిశ, ఉట్నూర్ : నార్నూర్ మండల కేంద్రంలోని గుంజాల గ్రామానికి చెందిన దళిత నేత, టీఆర్‌ఎస్ నాయకుడు కాంబ్లే నాందేవ్ బుధవారం గుండెపోటుతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గురువారం ఆయన అంత్యక్రియలకు వేలాదిగా తరలివచ్చిన ప్రముఖులు, అన్ని వర్గాల ప్రజలు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ కాంబ్లే నాందేవ్ మరణం టీఆర్‌ఎస్ పార్టీ కి తీరనిలోటని అన్నారు. ఆయనకు భార్య సత్యభామ, ఐదుగురు కూతుర్లు, నలుగురు కుమారులు ఉన్నారు. రెండేళ్ల క్రితం కుమారుడు అనారోగ్యంతో మరణించాడు. నాందేవ్ 1989 లో విద్యుత్ శాఖలో కాంట్రాక్టర్‌గా పని చేసారు. 1990 లో తడిహతూనూర్ గ్రామ పంచాయితీ కి తొలిసారిగా పీఏసీఎస్ చైర్మన్‌గా ఎన్నికై రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. 1994-95 లో నార్నూర్ పీఏసీఎస్ చైర్మన్‌గా తరువాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ గా ఎన్నికయ్యారు.
టీడీపీలో సామాన్య కార్యకర్తగా అడుగుపెట్టి తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయన సామాజిక కార్యక్రమాలను సైతం గతంలో ఎన్నో చేశారని, మచ్చలేని నేతగా ఎదిగారని ఆయన లేని లోటు బాధాకరమని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, న్యాయ, గృహనిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. దళిత సంఘాల వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ, కుమ్రంభీం జిల్లా జడ్పీచైర్ పర్సన్ కోవ లక్ష్మి, ఆదిలాబాద్ జిల్లా జడ్పిచైర్మన్ రాథోడ్ జనార్దన్, ఎమ్మెల్యేలు జోగురామన్న, ఆత్రం సక్కు, రాథోడ్ బాపురావు, మాజీ ఎంపీ గెడం నగేష్ , రాష్ట్ర డైరీ చైర్మన్ లోకభూమారెడ్డి, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు ఈశ్వరి బాయి, కుమ్రం భీం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవ రావు, స్థానిక సర్పంచ్ కుమార న్యానేశ్, నార్నూర్ సర్పంచ్ గజానంద్ బాణోత్ లతో పాటు పలువురు ప్రముఖులు కలిసి నివాళ్లులు అర్పించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.