టీమిండియా భారీ స్కోరు.. కివీస్ కి సవాలే

by Shiva |
టీమిండియా భారీ స్కోరు.. కివీస్ కి సవాలే
X

టీ20 సిరీస్ విజయంతో దూకుడు మీదున్న టీమిండియా మరోసారి భారీ స్కోరుతో న్యూజిలాండ్ జట్టుకు సవాల్ విసిరింది. హమిల్టన్ వేదికగా ఆరంభమైన వన్డే సిరీస్ లో టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా 347 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. యువ టీమిండియా బ్యాట్స్ మన్ దాడికి కివీస్ బౌలర్లు చేష్టలుడిగారనడంలో అతిశయోక్తి లేదు. మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే..

గాయం కారణంగా సిరీస్ కు దూరమైన రోహిత్ శర్మ గైర్హాజరీలో టీమిండియా ఓపెనర్లుగా పృథ్వీ షా, మయాంఖ్ అగర్వాల్ అరంగేట్రం చేశారు. పృథ్వీ షా (20) మూడు బౌండరీలతో తన ఉద్దేశాన్ని చాటితే, మయాంఖ్ అగర్వాల్ (32) ఆరు బౌండరీలతో దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించారు. ఇద్దరూ నిలదొక్కుకున్నారనుకున్నంతలో ఒకరి తరువాత ఒకరుగా పెవిలియన్ చేరారు. క్రీజులోకి వచ్చిన కోహ్లీ (51) జాగ్రత్తగా ఆడుతూ అర్ధ సెంచరీ చేశాడు. ఆ వెంటనే సోధీ బౌలింగ్ లో బౌల్డయ్యాడు.

కోహ్లీ పెవిలియన్ చేరడంతో శ్రేయస్ అయ్యర్ (13) నిలకడగా ఆడాడు. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ క్రీజులో నిలదొక్కుకున్నాడు. ఈ క్రమంలో సెంచరీ పూర్తి చేశాడు. అయితే కాసేపటికే పెవిలియన్ చేరాడు. కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్ లో ఐదో నంబర్ బ్యాట్స్ మన్ గా క్రీజులోకి వచ్చాడు. టీ20 ఫామ్ ను మరోసారి పునరావృతం చేస్తూ, బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేదార్ జాదవ్ (26)తో కలిసి కేవలం 64 బంతుల్లోనే 6 సిక్స్ లు, 3 బౌండరీలతో 88 పరుగులు చేశాడు.

దీంతో టీమిండియా తొలి వన్డేలో నాలుగు వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీ రెండు వికెట్లతో రాణించగా, కొలిన్ గ్రాండ్ హోం, ఇష్ సోథీ చెరో వికెట్ తీసి ఆకట్టుకున్నారు. అనంతరం న్యూజిలాండ్ జట్టు 348 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించింది.

Advertisement

Next Story

Most Viewed