- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టీమ్ ఇండియా ఏడాదంతా బిజీ
దిశ, స్పోర్ట్స్ : కరోనా మహమ్మారి కారణంగా 2020, 2021లో పెద్దగా క్రికెట్ సిరీస్‌లు జరగలేదు. స్వదేశంలో జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్‌లతో పాటు పలు విదేశీ పర్యటనలు కూడా వాయిదా పడ్డాయి. దీంతో 2022లో భారత జట్టు పూర్తి బిజీగా ఉండనున్నది. గతంలో వాయిదా పడిన సిరీస్‌లో రాబోయే రెండేళ్లలో నిర్వహించేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తున్నది. వచ్చే ఏడాది ముందుగా వెస్టిండీస్ జట్టు ఇండియాలో పర్యటిస్తుంది. ఇందులో మూడు వన్డేలు, మూడు టీ20లు జరుగుతాయి. ఆ తర్వాత శ్రీలంక జట్టు ఇండియా వచ్చి మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనున్నది.
ఆ తర్వాత పరిమిత ఓవర్ల సిరీస్ కోసం టీమ్ ఇండియా ఇంగ్లాండ్ వెళ్లనున్నది. అటు నుంచి భారత్ వెస్టిండీస్ వెళ్లి జులై- అగస్టు నెలల్లో మూడు వన్డేలు, 3 టీ20లు ఆడనున్నది. ఇక సెప్టెంబర్‌లో ఆసియా కప్ జరుగనున్నది. ఆ తర్వాత నవంబర్‌లో టీమ్ ఇండియా బంగ్లాదేశ్‌లో పర్యటించనున్నది. 2015 తర్వాత భారత జట్టు బంగ్లాలో పర్యటించడం ఇదే తొలిసారి. ఇక మధ్యలో ఐపీఎల్ కూడా ఉంటుంది. ఇవన్నీ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్‌లో కూడా పాల్గొంటుంది. మొత్తానికి 2022లో టీమ్ ఇండియా ఫుల్ బిజీగా గడపనున్నది.