- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో ఆ లోటు భారత్‌కు నష్టమా?
దిశ, స్పోర్ట్స్: భారత జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్నది. మరో మూడు రోజుల్లో సెంచూరియన్ వేదికగా తొలి టెస్టు (బాక్సింగ్ డే) ప్రారంభం కానున్నది. ఇప్పటికే జొహన్నెస్‌బర్గ్ చేరుకున్న భారత జట్టు తీవ్రంగా నెట్స్‌లో సాధన చేస్తున్నది. దక్షిణాఫ్రికా గడ్డపై టీమ్ ఇండియాకు తొలి సారి టెస్టు విజయాన్ని అందించిన రాహుల్ ద్రవిడ్ ఇప్పుడు హెడ్ కోచ్‌గా ఉన్నాడు. దక్షిణాఫ్రికా గడ్డపై 1992 నుంచి భారత జట్టు ఏడు సార్లు టెస్టు సిరీస్ కోసం పర్యటించింది. ఇందులో ఒక్క సిరీస్ డ్రాగా ముగియగా.. మిగిలిన సిరీస్‌లు అన్నీ ఓడిపోయాము.
అయితే అక్కడ భారత జట్టు కేవలం 3 టెస్టులు మాత్రమే గెలిచింది. ద్రవిడ్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ నేతృత్వంలో తలా ఒక టెస్టు మ్యాచ్ గెలిచాము. ఈ సారి ద్రవిడ్ కోచ్‌గా.. కోహ్లీ మరోసారి కెప్టెన్‌గా సిరీస్ ఆడబోతున్నాము. దక్షిణాఫ్రికా పర్యటన ముందు భారత జట్టులో కెప్టెన్సీ విషయంపై కాస్త గందరగోళం ఏర్పడింది. కానీ ఇప్పుడు అన్నీ మరిచిపోయి టెస్టు సిరీస్ విజయంపై దృష్టి పెట్టారు. అయితే భారత జట్టు ఎంపికలోనే ఒక పెద్ద లోపం ఉన్నట్లు క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం ఆఫ్ స్పిన్నర్లతోనే భారత జట్టు సఫారీ పర్యటన కొనసాగిస్తున్నది.
కుంబ్లే వంటి స్పిన్నర్ లేడు..
దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోసం 18 మందితో కూడిన భారత జట్టు దక్షిణాఫ్రికా చేరుకున్నది. ఇందులో కేవలం ఇద్దరు స్పిన్నర్లు మాత్రమే మిగిలారు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ గాయం కారణంగా జట్టుకు దూరం అవడంతో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు జయంత్ యాదవ్ జట్టులో మిగిలారు. వీరిద్దరూ ఆఫ్ స్పిన్నర్లు కావడం గమనార్హం. దక్షిణాఫ్రికా పిచ్‌లపై గతంతో లెగ్ స్పిన్నర్లు చక్కగా రాణించారు. ఇండియా – సౌతాఫ్రికా టెస్టు హిస్టరీ చూస్తే అనిల్ కుంబ్లే అత్యంత విజయవంతమైన స్పిన్నర్‌గా గుర్తింపు పొందాడు. దక్షిణాఫ్రికాతో 21 టెస్టులు ఆడిన కుంబ్లే 84 వికెట్లు తీశాడు. ఇందులో దక్షిణాఫ్రికా గడ్డపై 12 టెస్టుల్లో ఏకంగా 45 వికెట్లు తీయడం గమనార్హం. అనిల్ కుంబ్లే రిటైర్ అయిన తర్వాత అలాంటి లెగ్ స్పిన్నర్‌ను కనుగొనడంలో టీమ్ ఇండియా విఫలమైంది. దీంతో అలాంటి ఆటగాడి కోసం ఇప్పటికీ అన్వేషణ కొనసాగుతున్నది. ఒకరిద్దరు లెగ్ స్పిన్నర్లు ఉన్నా.. వాళ్లు కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్‌కే పరిమితం కావడం గమనార్హం. లెగ్ స్పిన్నర్ లేకుండా దక్షిణాఫ్రికా పిచ్‌లపై ఆఫ్ స్పిన్నర్లు వికెట్లు పడగొట్టగలరా అనే అనుమానాలు నెలకొన్నాయి.
కుల్దీప్, చాహల్ జోడి ఏమయ్యింది?
భారత జట్టు తరఫున విజయవంతమైన కుల్దీప్ యాదవ్ ఎడమ చేతితో లెగ్ స్పిన్ వేస్తాడు. అతడు వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన రికార్డు ఉన్నది. టెస్టు మ్యాచ్‌లలో కూడా భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించాడు. 7 టెస్టుల్లో 26 వికెట్లు తీశాడు. 2017-18 ఆస్ట్రేలియా పర్యటనలో అతడి ప్రదర్శన చూసి అప్పటి కోచ్ భారత జట్టునెంబర్ 1 స్పిన్నర్ అని కితాబు ఇచ్చాడు. కానీ ఆ తర్వాత కుల్దీప్ జట్టులో స్థానాన్ని పదిలపరుచుకోవడంతో పూర్తిగా విఫలమయ్యాడు. భారత్ తరఫున 174 వికెట్లు తీసిన కుల్దీప్ ప్రస్తుతం వన్డే, టీ20ల్లో కూడా స్థానం కోల్పోయాడు.
గత ఐదేళ్లుగా యజువేంద్ర చాహల్ మంచి లెగ్ స్పిన్నర్‌గా రాణించాడు. కానీ అతడు వన్డే, టీ20 ఫార్మాట్‌లో అద్భుతమైన బౌలర్ అయినా.. టెస్టుల్లో మాత్రం స్థానం సంపాదించలేకపోయాడు. మరోవైపు అమిత్ మిశ్రాకు భారత జట్టులో స్థానం దక్కినా కేవలం 22 టెస్టులు మాత్రమే ఆడాడు. ప్రస్తుతం అతడు ఐపీఎల్ వంటి లీగ్‌లలో మాత్రమే ఆడుతున్నాడు. ముంబై ఇండియన్స్ జట్టులోని రాహుల్ చాహర్ మంచి లెగ్ స్పిన్నర్‌గా రూపాంతరం చెందుతున్నాడు. ఇంకా అనుభవం పెద్దగా లేని చాహర్ ఇటీవలే వన్డే, టీ20లో చోటు దక్కించుకున్నాడు. కానీ టెస్టుల్లో అతడికి చోటు దక్కాలంటే మరింత రాటు దేలాల్సిన అవసరం ఉన్నది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో భారత జట్టు స్పిన్ భారమంతా రవిచంద్రన్ అశ్విన్ పైనే ఉన్నది. జయంత్ యాదవ్‌తోకలసి అతడు తప్పకుండా ప్రభావం చూపుతాడని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇద్దరికీ ఒకేసారి తుది జట్టులో స్థానం దొరకడం కష్టమే.