క్రికెట్‌కు ప్రజ్ఞాన్ ఓజా.. టాటా

by Shyam |
క్రికెట్‌కు ప్రజ్ఞాన్ ఓజా.. టాటా
X

టీమిండియా స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. తన కెరీర్ ఎదుగుదలకు సహకరించిన వారందరికి ఓజా ధన్యవాదాలు తెలిపాడు. ‘ అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి వైదొలగడానికి ఇదే సరైన సమయం. ఇండియాకు ప్రాతినిద్యం వహించడం గొప్ప గౌరవం’ అని ఓజా పేర్కొన్నాడు. కాగా, ఓజా భారత్‌ తరఫున 24 టెస్టులు, 18 వన్డేలు, 6 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 113 వికెట్లు, వన్డేల్లో 21, టీ20ల్లో 10 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో డెక్కన్‌ చార్జర్స్‌, ముంబై ఇండియన్స్‌ తరుపున ఆడిన ఓజా, 2018లో బిహార్‌ తరఫున తన చివరి ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ ఆడాడు.

Advertisement

Next Story