- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టెస్టు చరిత్రలో టీమిండియా చెత్త రికార్డు
దిశ, స్పోర్ట్స్ : బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్‌లో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్‌లో టీమ్ ఇండియా చెత్త రికార్డు సృష్టించింది. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 36 పరుగులే చేసి చెత్త రికార్డు మూటగట్టుకున్నది. ఓవర్ నైట్ స్కోర్ 9/1తో శనివారం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ ఇండియా వరుసగా వికెట్లు కోల్పోయింది. బ్యాట్స్‌మెన్ నువ్వా నేనా అన్నట్లు అందరూ పెవిలియన్‌కు క్యూ కట్టారు. 15 పరుగుల వద్ద వరుసగా నాలుగు వికెట్లు పడ్డాయి.
నైట్ వాచ్మాన్ జస్ప్రిత్ బుమ్రా (2) కమ్మిన్స్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే చతేశ్వర్ పుజార (0) కూడా కమ్మిన్స్ బౌలింగ్‌లోని కీపర్ పైన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. జోష్ హాజెల్‌వుడ్ ఒకే ఓవర్లో మయాంక్ అగర్వాల్ (9), అజింక్య రహానే (0)ను అవుట్ చేశాడు. మరో నాలుగు పరుగులు జోడించిన తర్వాత విరాట్ కోహ్లీ (4) కమ్మిన్స్ బౌలింగ్‌లో గ్రీన్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు వెనుదిరిగాడు. హనుమ విహారి (8), వృద్దిమాన్ సాహ (4), రవిచంద్రన్ అశ్విన్ (0) వరుసగా క్యూకట్టారు. అయితే పాట్ కమ్మిన్స్ వేసిన ఒక బంతి మహ్మద్ షమి చేతికి తగిలి గాయపడటంతో అతడు రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగడంతో టీమ్ ఇండియా 36/9 పరుగులకు రెండో ఇన్నింగ్స్ ముగించింది. ఒక్క బ్యాట్స్మాన్ కూడా డబుల్ డిజిట్ స్కోర్ చేయలేదు. మయాంక్ అగర్వాల్ చేసిన 9 పరుగులే ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. జోష్ హాజెల్‌వుడ్ 5 వికెట్లు తీసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో 200 వికెట్ల క్లబ్లో చేరాడు. ఆస్ట్రేలియా గెలవాలంటే 90 పరుగులు చేయాలి.
టెస్టుల్లో టీమ్ ఇండియాకు ఇదే అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం. 1974లో ఇంగ్లాండ్‌తో లార్డ్స్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇండియా 42 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దాని తర్వాత ఇదే అత్యల్ప స్కోర్.
టెస్టుల్లో లోయెస్ట్ స్కోర్లు
న్యూజీలాండ్ – 26 (ఇంగ్లాండ్‌పై 1955)
సౌత్ ఆఫ్రికా – 30 (ఇంగ్లాండ్‌పై 1896)
సౌత్ ఆఫ్రికా – 30 (ఇంగ్లాండ్‌పై 1924)
సౌత్ ఆఫ్రికా – 35 (ఇంగ్లాండ్‌పై 1899)
సౌత్ ఆఫ్రికా – 36 (ఆస్ట్రేలియాపై 1932)
ఆస్ట్రేలియా – 36 (ఇంగ్లాండ్‌పై 1902)
ఇండియా – 36 (ఆస్ట్రేలియాపై 2020)