హాలోవిన్ పార్టీలో టీమ్ ఇండియా క్రికెటర్ల పిల్లలు

by Shyam |
హాలోవిన్ పార్టీలో టీమ్ ఇండియా క్రికెటర్ల పిల్లలు
X

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా క్రికెటర్లు తమ పిల్లలతో కలిసి దుబాయ్‌లో హాలోవిన్ పార్టీ చేసుకున్నారు. భారత జట్టు కెప్టెన్ కోహ్లీ కూతురు వామిక, హార్దిక్ పాండ్యా కొడుకు, రోహిత్ శర్మ కూతురు, రవిచంద్రన్ అశ్విన్ ఇద్దరు కూతుర్లు ఈ పార్టీకి విచిత్ర వేషధారణలో వచ్చి ఆకట్టుకున్నారు. ముఖ్యంగా కోహ్లీ-అనుష్కల కూతురు వామిక ఏంజెల్ లాగా తయారై వచ్చి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇక యువ క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, శార్దుల్ ఠాకూర్, సూర్యకుమార్ యాదవ్ కూడా ఆ పార్టీకి వచ్చి పిల్లలతో కలిసి ఎంజాయ్ చేశారు. డ్యాన్సులు చేస్తూ పాటలు పాడుతూ పార్టీలో సందడి చేశారు. ఇక అయ్యర్ అయితే పిల్లలతో కలసి కార్డ్ గేమ్స్ ఆడాడు. ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలను అనుష్క శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీగా పెట్టుకున్నది. అశ్విన్ భార్య ప్రీతి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు అప్‌లోడ్ చేయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story

Most Viewed