- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రిడ్జ్ కోర్స్ ద్వారా విద్యార్థులకు పాఠాలు
దిశ, తెలంగాణ బ్యూరో: జులై 1 నుంచి ప్రారంభమైన ఆన్‌లైన్ తరగతుల్లో ప్రభుత్వం మొదటగా బ్రిడ్జ్ కోర్స్ విధానాన్ని ప్రవేశపెట్టి పాఠాలను బోధిస్తుంది. దూరదర్శన్, టీ శాట్ చానల్ ద్వారా రికార్డ్ చేసిన తరగతులను టెలికాస్ట్ చేస్తున్నారు. ఒక సబ్జెక్ట్‌కు సంబంధించి 4 క్లాసుల చొప్పున పాఠాలను విద్యార్థులకు అందిస్తున్నారు. ఈ విధానం విద్యార్థులను అయోమయానికి గురి చేస్తుంది. తరగతులను వీక్షిస్తున్నప్పుడు తలెత్తిన అనుమానాలను ఏ విధంగా నివృత్తి చేసుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. గతేడాది సబ్జెక్ట్‌లను విద్యార్థులను గుర్తు చేసేందుకు నిర్వహిస్తున్న బ్రిడ్జ్ కోర్స్ విధానం నిరుపయోగమవుతుంది.
ఆన్‌లైన్ తరగతుల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వలన విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. స్పష్టత లేని నిర్ణయాలను తీసుకోవడం ద్వారా ఆచరణలో పలు రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. ఆన్‌లైన్ తరగతులను ప్రైవేటు విద్యాసంస్థలకు ధీటుగా నిర్వహించకపోవడం వలన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ప్రైవేటు విద్యాసంస్థలు టెక్నాలజీని వినియోగించుకొని వివిధ రకాల యాప్‌ల ద్వారా విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తున్నారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడుతూ.. పాఠ్యాంశాలను బోధిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం దూరదర్శన్, టీ శాట్ ద్వారా రికార్డ్ చేసిన తరగతులను విద్యార్థులకు అందిస్తున్నారు. ఈ విధానం ద్వారా ప్రస్తుతం అమలవుతున్న బిడ్జ్ కోర్స్ తరగతులు విద్యార్థులకు ఏ మాత్రం ఉపయోగపడటం లేదు.
జులై 1 నుంచి ప్రారంభమైన బ్రిడ్జ్ కోర్స్..
విద్యార్థులకు మొదటగా అకాడమిక్ ఇయర్ పాఠాలను బోధించకుండా విద్యార్థుల విద్యా నైపుణ్యాన్ని పెంచేందుకు బ్రిడ్జికోర్స్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గతేడాది సబ్జెక్ట్‌లను విద్యార్థులకు గుర్తు చేసేందుకు ఈ తగరతులను నిర్వహిస్తున్నారు. ఉదాహరణకు ఈ ఏడాది పదో తరగతికి చేరుకున్న విద్యార్థి 8వ తరగతి పరీక్షలు రాయకుండా 9వ తరగతిని చదవకుండా 10వ తరగతికి చేరుకున్నాడు. ఈ విద్యార్థిలో పదోవతరగతి పాఠాలను అర్థం చేసుకోగల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు బ్రిడ్జ్ కోర్స్ విధానాన్ని ప్రవేశపెట్టారు. గతేడాది పాఠ్యాంశాలను ఒక్కో సబ్జెక్ట్‌కు 4 తరగతుల చొప్పున పాఠాలను బోధిస్తున్నారు.
దూరదర్శన్, టీ శాట్ ద్వారా పరీక్షలు..
దూరదర్శన్, టీ శాట్ చానళ్ల ద్వారా ప్రభుత్వం పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తున్నారు. ప్రత్యేక షెడ్యూల్‌ను ఏర్పాటు చేసి అన్ని తరగతుల విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో పాఠాలను బోధిస్తున్నారు. మందుస్తుగా రికార్డ్ చేసిన తరగతులను టెలికాస్ట్ చేసి ఒక్కో క్లాస్‌ను 30నిమిషాల పాటు బోధిస్తున్నారు.
విద్యార్థుల అనుమానాలను నివృత్తి చేయలేని విధానం
ప్రభుత్వం దూరదర్శన్, టీ సాట్ ద్వారా నిర్వహిస్తున్న తరగతులు విద్యార్థులకు ఏ మాత్రం ఉపయోగపడటం లేదు. గతేడాది పాఠ్యాంశాల క్లాసులకు హాజరువుతున్న విద్యార్థులకు సబ్జెక్ట్‌లపై పలు అనుమానాలను తలెత్తుతున్నాయి. కేవలం రికార్డ్ చేసిన తరగతులను మాత్రమే బోధించడం ద్వారా ఉపాధ్యాయులను సంప్రదించే అవకాశాన్ని విద్యార్థులు కోల్పోతున్నారు. టీచర్లకు విద్యార్థులకు ఇంట్రాక్షన్ లేకపోవడం ద్వారా తలెత్తిన సందేహాలను నివృత్తి చేసుకోలేక పోతున్నారు. అర్థమయ్యి కానట్టుగా బ్రిడ్జ్ కోర్సు పాఠాలకు విద్యార్థులు హాజరుకావాల్సి వస్తుంది.
- Tags
- Bridge Course