‘త్వరలో ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు’

by Aamani |
‘త్వరలో ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు’
X

దిశ, తాండూర్ : త్వరలో కొత్త జిల్లాల వారీగా ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు జరుగుతాయని పీఆర్టీయూ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. మండలంలోని అచలాపుర్, రేచిని జెడ్పీహెచ్ఎస్ లను ఆయన బుధవారం సందర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై పీఆర్టీయూ అహర్నిశలు కృషి చేస్తోందన్నారు. స్కావెంజర్స్ సమస్యల పరిష్కారం ఉత్తర్వులు, 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు ఉత్తర్వులు వస్తాయని పేర్కొన్నారు.

అంతకుముందు పాఠశాలలోని ఉపాధ్యాయుల సమస్యలను పీఆర్టీయూ నాయకులు అడిగి తెలుసుకున్నారు. జనరల్ ఫండ్ లో భాగంగా ఉపాధ్యాయుల నుండి నాయకులు విరాళాలు సేకరించారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాసాడి శ్రీరాములు, మండల అధ్యక్షుడు జాడి పోచయ్య, ప్రచార కార్యదర్శి రవీందర్, మహిళా అధ్యక్షురాలు రాజేశ్వరి, కార్యదర్శి శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story