రెచ్చిపోయిన మంత్రి అనుచరులు.. ఝలకిచ్చిన గౌతు శిరీష

by srinivas |   ( Updated:2021-08-02 08:53:21.0  )
Shirisha
X

దిశ, ఏపీ బ్యూరో : ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజుపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష శ్రీకాకుళం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తనపై సోషల్ మీడియాలో అసభ్యకర ఫొటోలు, వీడియోలు పెట్టి వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో సర్దార్ గౌతు లచ్చన్న కుటుంబంపై మంత్రి అప్పలరాజు అనుచరులు.. ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. తనను మానసికంగా ఇబ్బంది పెట్టి పశువులతో అడ్డగోలు రాతలు రాయిస్తున్న మంత్రి అప్పలరాజుపై చర్యలు తీసుకోవాలని గౌతు శిరీష ఫిర్యాదులో కోరారు.

ప్రతిఘటన తప్పదు: ఎంపీ రామ్మోహన్‌నాయుడు

మంత్రి సీదిరి అప్పలరాజుపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌతు శిరీషపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టింగులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. మంత్రి అప్పలరాజు అనుచరులు పశువుల్లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. గౌతు శిరీషపై దుష్ప్రచారం ఆపకపోతే ప్రతిఘటన తప్పదని ఎంపీ రామ్మోహన్ నాయుడు హెచ్చరించారు.

Advertisement

Next Story