- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈ ప్రభుత్వం వలనే హత్యలు, అత్యాచారాలు ..చిన్నారి హత్యాచార ఘటనపై టీడీపీ ఫైర్
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఐఎస్ సదన్ డివిజన్లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారిపై హత్యాచార ఘటన జరిగిందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన ఆరోపించారు. సోమవారం సైదాబాద్ సింగరేణి కాలనీలో బాధిత కుటుంబాన్ని టీడీపీ బృందం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే మహిళలపై, బాలికలపై, చిన్నారులపై అత్యాచారం, హత్యా ఘటనలు జరుగుతున్నాయని, రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసినప్పటికీ తీర్పును వేగవంతం చేయకపోవడంతో నిందితులకు శిక్ష పడడంలో ఆలస్యమవుతుందని, దీంతో బాధిత కుటుంబాలకు చట్టాలపై నమ్మకం పోతుందని అన్నారు.
ప్రభుత్వం నిందితులకు శిక్ష పడేలా ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేసిన ఆమె బాధిత చిన్నారి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని కోరారు. చిన్నారిపై అత్యాచారం చేసి, హాత్య చేసిన నిందితుడు రాజుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. మహిళల భద్రతకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని, తప్పు చేయాలంటేనే భయపడేలా శిక్షలు అమలు చేయాలని, ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని డిమాండ్ చేశారు. పరామర్శించిన, తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి సూర్యదేవర లత, టీడీపీ కార్యకర్తలు అశోక్, వాహిద్, మల్లేష్, దుర్గారావు తదితరులు పాల్గోన్నారు.