Vijayasai Reddy ఫోన్ మిస్సింగ్‌పై టీడీపీ సంచలన ఆరోపణలు

by srinivas |   ( Updated:2022-11-23 15:08:31.0  )
Vijayasai Reddy ఫోన్ మిస్సింగ్‌పై టీడీపీ సంచలన ఆరోపణలు
X
  • లిక్కర్ స్కామ్‌ నుంచి తప్పించుకునేందుకు డ్రామా
  • తాడేపల్లి వీఐపీ అడ్డా నుంచి ఫోన్ మిస్ అవ్వడం అసాధ్యం
  • ఈడీ నాలుగు తగిలిస్తే ఫోన్ బయటకు వస్తుంది

దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఫోన్ మిస్ (VijayaSaireddy Phone Miss) అయ్యింది. ఫోన్ కనిపించకపోవడంతో తాడేపల్లి పీఎస్‌లో ఫిర్యాదు సైతం చేశారు. అయితే ఈ ఫోన్ మిస్సింగ్‌పై టీడీపీ (Tdp) ఘాటుగా స్పందించింది. ఇది పక్కా ప్లాన్‌తోనే ఫోన్ మిస్ అయినట్లు నాటకాలు ఆడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam)లో తనపాత్ర, జగన్ (Jagan) పాత్ర బయటపడకూడదనే ప్రీ ప్లాన్‌గా ఏ2 ఫోన్ పోయిందని నాటకాలు ఆడుతున్నాడంటూ ధ్వజమెత్తింది. ఈడీ నాలుగు తగిలిస్తే విజయసాయిరెడ్డి ఫోన్ బయటకు వస్తుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏ2 విజయసాయిరెడ్డి లిక్కర్ స్కామ్ నుంచి బయటపడటానికే తన క్రిమినల్ తెలివితేటలను ప్రదర్శిస్తూ ఫోన్ పోయిందని నాటకాలు ఆడుతున్నారని ఆరోపించింది. ఈడీ అధికారులు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంటేనే లిక్కర్ స్కామ్ అసలు దొంగల గుట్టు రట్టు చేయగలరని సూచిస్తున్నారు. వీఐపీల అడ్డా తాడేపల్లి ప్యాలెస్‌లో ఫోన్ పోవడం అంత ఆషామాషీ కాదని టీడీపీ చెప్తోంది.

ఫోన్ పోలేదు.. పడేశాడు: Ayyannapatrudu

వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ఫోన్ మిస్సింగ్‌పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు సెటైర్లు వేశారు. ఏ2 ఫోన్ పోలేదని.. పడేశాడని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంతో తాడేపల్లి ప్యాలెస్ పూసాలు కదులుతున్నాయని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు.

ఈడీ తలచుకుంటే ఫోన్ బయటకు వస్తుంది: ks jawahar

వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ఫోన్ అదృశ్యంపై మాజీ మంత్రి కేఎస్ జవహర్ ఘాటుగా స్పందించారు. ఈడీ నాలుగు తగిలిస్తే విజయసాయిరెడ్డి ఫోన్ బయటకువస్తుందన్నారు. గతంలో కూడా అక్రమాస్తుల విచారణకు సంబంధించి ఈడీ నమోదు చేసిన కేసుల విచారణ ఎదుర్కొనే సమయంలో విజయసాయిరెడ్డి ల్యాప్ ట్యాప్ వాడటంరాదని చెప్పి తప్పించుకోవాలని చూశారని.. ఈడీ తనదైనశైలిలో విచారించి రెండు పీకగానే అన్నీ ఒప్పుకున్నాడని గుర్తు చేశారు. తప్పుచేయడం తప్పుడు ఆధారాలతో తప్పించుకోవాలని చూడటం ఏ2కి వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. వీఐపీల అడ్డా తాడేపల్లి ప్యాలెస్‌లో ఫోన్ పోవడం అంత ఆషామాషీకాదన్నారు. ఏ2 విజయసాయిరెడ్డి లిక్కర్ స్కామ్ నుంచి బయటపడటానికే తనక్రిమినల్ తెలివితేటలు ప్రదర్శిస్తూ ఫోన్ పోయిందని నాటకాలు ఆడుతున్నాడని, ఈడీ అధికారులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంటేనే లిక్కర్ స్కామ్ అసలుదొంగలు గుట్టురట్టు చేయగలరని, దొంగబుద్ధితో వ్యవహరిస్తున్న విజయసాయి ఆటకట్టించగలరని కేఎస్ జవహర్ స్పష్టం చేశారు. విజయసాయి ఫోన్‌ని జగన్ రెడ్డే తాడేపల్లిప్యాలెస్ నేలమాళిగలో దాచాడనే అనుమానం కలుగుతోందని. లిక్కర్ స్కామ్ బయటపడ్డాకే విజయసాయిరెడ్డి ఫోన్ పోవడంలో ఆంతర్యం ఏమిటి? అని ప్రశ్నించారు. పోయిన ఫోన్‌లో శరత్ చంద్రారెడ్డి, విజయసాయిరెడ్డిల లావాదేవీలు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లావాదేవీలు, ఇతర నిగూఢ అంశాలు దాగున్నాయనే అనుమానం కలుగుతోందన్నారు.

'సముద్రపు లోతులో దాగి ఉండే రహస్యాలను మించిన రహస్యాలు ఏ2 ఫోన్‌లో జాగ్రత్తగా ఉండి ఉండొచ్చు. లిక్కర్ స్కామ్‌కి సంబంధించిన వాటాల వ్యవహారం.. విజయసాయిరెడ్డికి ఎంత.. జగన్ రెడ్డికి ఎంత.. ఢిల్లీలో ఎవరికిఎంతెంత పంచారనే వివరాలు కూడా దానిలో ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా అత్యాధునిక సాంకేతికత ఉందని చెప్పుకునే ఐఫోన్ పోవడం అంత ఆషామాషీకాదు. నిజంగానే ఐఫోన్ పోతే అది ఎక్కడుందో తెలుసుకోవచ్చు. పోయిన ఫోన్‌కి కచ్చితంగా విజయసాయి ఫేస్ రికగ్నైజేషన్ ఉండి ఉంటుంది. ఆయన ముఖం వద్ద ఫోన్ పెడితే అదే ఓపెన్ అవుతుంది. అది కూడా సాధ్యంకాకపోతే టెక్నాలజీ తెలిసినవారితో దాన్ని ఓపెన్ చేయించవచ్చు' అని కేఎస్ జవహర్ చెప్పుకొచ్చారు. తన అల్లుడుని ఈడీ విచారిస్తున్నప్పుడే విజయసాయి ఫోన్ పోవడం ముమ్మాటికీ తాడేపల్లి ప్యాలెస్ రహస్యమేనని కేఎస్ జవహర్ అన్నారు.

ఇవి కూడా చదవండి :

Pallakolluలో వైసీపీ భారీ స్కెచ్.. ఇద్దరు కీలక నేతలకు గాలం?

Advertisement

Next Story