- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ
దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే ప్రతి ఇంటికి మంచి నీటిసరఫరా చేయడంతో పాటు పేదలందరికీ ఉచిత నల్లా కనెక్షన్ ఇస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ ప్రకటించారు. పూర్తి స్థాయిలో వైఫై నగరంగా చేయడానికి కృషి చేస్తామని, ప్రతి ఇంటికి పైపులైన్ల ద్వారా వంట గ్యాస్ సరఫరా, పేదవారికి పక్కా గృహాలు నిర్మిస్తామన్నారు. సోమవారం ఎన్టీఆర్ భవన్‌లో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసి మాట్లాడారు. టీడీపీ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని గుర్తుచేశారు. మాటలకే పరిమితమై టీఆర్ఎస్ కావాలో.. అభివృద్ధి చేసే తెలుగుదేశం పార్టీ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు.
టీడీపీ మేనిఫెస్టో ..
– ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా, పేదలందరికీ ఉచిత నల్లా కనెక్షన్
– పూర్తి స్థాయిలో వైఫై నగరం
– ప్రతి ఇంటికి పైపులైన్ల ద్వారా వంట గ్యాస్ సరఫరా
– ప్రతి పేదవారికి పక్కా గృహాల నిర్మాణం
– డ్రైనేజీ వ్యవస్థను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడం
– యువతకు, మహిళలకు ఉపాధి రుణాలు
– ప్రతి డివిజన్లో మొబైల్ ఆసుపత్రి, ఉచితంగా మందుల పంపిణీ
– అవసరమైన ప్రతిచోట ఫ్లై ఓవర్ల నిర్మాణం
– మెట్రో రైలు, ఎంఎంటీఎస్ విస్తరణ
– బీఆర్టీఎస్ ఏర్పాటు
– వేస్ట్ టు ఎనర్జీ, డంపు యార్డు ఫ్రీ సిటీ
– శివారు ప్రాంతాల అభివృద్ధికి రంగారెడ్డి అర్బన్ మెట్రోపాలిటన్ కమిటీ
– శివార్లలోని 64డివిజన్లలో మంచినీటి ఫీడర్ లైన్ల వ్యవస్థ
– మోడల్ కాలనీలుగా బస్తీల అభివృద్ధి
– 200గజాల లోపు స్థలాల్లో నిర్మాణాలకు అనుమతులు ఉండాలన్న నిబంధన సడలింపు
– మూసీకి సమాంతరంగా రోడ్ల అభివృద్ధి
– జంట జలశయాల నీటి నిల్వల సామర్ధ్యం పెరిగేటట్లు చర్యలు
– ఐటీఐఆర్ ప్రాజెక్టు
– ఎల్ఆర్ఎస్ పథకం రద్దు