- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గ్రేటర్ ప్రజలను ఆదుకోవడంలో టీఆర్ఎస్ విఫలం : బక్కని
దిశ, తెలంగాణ బ్యూరో : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు ఆరోపించారు. సోమవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద గ్రేటర్ హైదరాబాద్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన ప్రతి బాధిత కుటుంబానికి రూ.10వేలు ఇస్తామని చెప్పి విస్మరించిందన్నారు. ఎన్నికల సమయంలోనే ప్రజలు, వారి సమస్యలు గుర్తుకు వస్తాయని, ఎన్నికల తర్వాత గాలికి వదిలేయడం టీఆర్ఎస్ నాయకులకు అలవాటే అని ధ్వజమెత్తారు.
నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో రోడ్లు, డ్రైనేజీల మరమ్మతులకు గురయ్యాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలతో పాటు చిరువ్యాపారులను ఆదుకునేందుకు జీహెచ్ఎంసీకి రూ.5000ల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ట్రాఫిక్ పోలీసులు వేసిన ఫైన్లను రద్దు చేయాలని కోరారు. ఈ సమావేశంలో పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, గ్రేటర్ కన్వీనర్, పొలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి కంభంపాటి రామ్మోహన్ , సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు పి.సాయిబాబా, నల్లెల్ల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
- Tags
- GHMC
- inland areas