- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుప్పంలో వైసీపీ అక్రమాలు.. ఎస్ఈసీకి చంద్రబాబు లేఖ
దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీకి లేఖ రాశారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయంటూ లేఖలో ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీతోపాటు ఇతర పార్టీల అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని.. అంతేకాకుండా దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 14వ వార్డు టీడీపీ అభ్యర్థి వెంకటేశ్‌పై వైసీపీ నేతలు దాడి చేశారని..నామినేషన్ పత్రాలు చింపివేశారని లేఖలో ఆరోపించారు. నామినేషన్లు దాఖలు చేసే కేంద్రం వద్దే దాడి జరిగిందని లేఖలో వెల్లడించారు.
ఈ దాడిలో 30 మంది వైసీపీ నేతలు పాల్గొన్నారని..కొట్టి గాయపరచడమే కాకుండా అతడి సెల్ ఫోన్ లాగేసుకున్నారని ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు అభ్యర్థులకు భద్రత కల్పించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. స్వేచ్ఛగా నామినేషన్ వేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో దాడికి సంబంధించిన ఫొటోలను కూడా చంద్రబాబు తన లేఖకు జతచేశారు.
స్పెషల్ ఆఫీసర్ లోకేశ్వర వర్మను తొలగించండి
కుప్పం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన స్పెషల్ ఆఫీసర్ లోకేశ్వర వర్మను తొలగించాలని ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. తెలుగుదేశం పార్టీ ఈ లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేసింది. లోకేశ్వర వర్మ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని పిటిషన్‌లో టీడీపీ ఆరోపించింది. అయితే ఈ పిటిషన్‌పై సోమవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.