18న ఢిల్లీకి టీడీపీ ఎమ్మెల్సీలు..

by srinivas |
18న ఢిల్లీకి టీడీపీ ఎమ్మెల్సీలు..
X

ఏపీ టీడీపీ ఎమ్మెల్సీలు మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. శాసనమండలి రద్దు అంశంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలసి వివరించనున్నట్టు సమాచారం.అందుకోసం రెండురోజులు వారు దేశరాజధానిలో బిజీబిజీగా గడుపనున్నారు.ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నఏకపక్ష నిర్ణయాలు, 50రోజులకు పైగా అమరావతిలో రాజధాని రైతులు చేస్తున్ననిరసనల గూర్చి ఉపరాష్ట్రపతికి వివరించనున్నారు.శాసనమండలి రద్దు అంశంపై కేంద్రంతో మాట్లాడాలని, అమరావతి రైతులు మనోభావాలను పరిగణలోనికి తీసుకుని వారికి న్యాయం జరిగేలా చూడాలని టీడీపీ అధిష్టానం తరఫున ఎమ్మెల్సీలు విన్నవించనున్నట్టు తెలుస్తోంది. కాగా,ఈ అంశంపై ఉపరాష్ట్రపతి ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే వేచి చూడాల్సిందే..

Next Story

Most Viewed