- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కొడాలి నానికి జూ.ఎన్టీఆర్ అంటే భయం.. టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు
దిశ, ఏపీ బ్యూరో: జూ.ఎన్టీఆర్‌పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ అసెంబ్లీలో నారా భువనేశ్వరిని వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తే జూ.ఎన్టీఆర్ ఖండించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. మేనత్తను నోటికొచ్చినట్లు మాట్లాడితే జూ.ఎన్టీఆర్ స్పందించిన తీరు సరిగ్గా లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది తన ఒక్కడి అభిప్రాయం మాత్రమే కాదని రాష్ట్రం మెుుత్తం కోడై కూస్తోందన్నారు. సినిమాల కోసం కుటుంబాన్ని, నైతిక విలువలను వదులుకుంటారా అంటూ వర్ల రామయ్య ఎన్టీఆర్‌ను ప్రశ్నించారు.
ఇకపోతే అసెంబ్లీలో నారా భువనేశ్వరిపై మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు కుటుంబానికి వారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ వర్ల రామయ్య దంపతులు విజయవాడలో దీక్షకు దిగారు. ఈ దీక్షలో వర్ల రామయ్య జూ.ఎన్టీఆర్‌పై బాణం ఎక్కుపెట్టారు. నారా భువనేశ్వరిపై మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ విమర్శలు చేస్తే భువనేశ్వరి మేనల్లుడిగా జూనియర్ ఎన్టీఆర్ అలా ఎలా స్పందిస్తారని సందేహం వ్యక్తం చేశారు. అంతేకాదు నందమూరి హరికృష్ణ బతికి ఉంటే ఇంకో రకంగా ఉండేదని ఆయనే నేరుగా రంగంలోకి దిగి రచ్చరచ్చ చేసుండేవాడని చెప్పుకొచ్చారు. మరి మీరు ఎందుకు అలా చేయలేకపోయారు..మీ నాన్నకు చెల్లెలు అయినప్పుడు మీకు అత్తే కదా? మీ మేనత్తను అంటే ఇలాగే స్పందిస్తావా ?’ మండిపడ్డారు.
వల్లభనేని వంశీ ఫొటోలు పెట్టినప్పుడే తారక్ ఘాటుగా స్పందించి ఉంటే ఇంత జరిగేది కాదు కదా అని చెప్పుకొచ్చారు. సినిమాల కోసం కుటుంబాన్ని, బంధుత్వాన్ని పోగొట్టుకుంటారా? అంటూ వర్ల రామయ్య ప్రశ్నించారు. వీళ్లంతా సినిమా తీసిన బ్యాచ్.. మళ్లీ మూవీ తీస్తారని సరిగా స్పందించలేదా అని సందేహం వ్యక్తం చేశారు. వారిని మందలించే శక్తి ఎన్టీఆర్‌కు ఉందన్నారు. బాలయ్యకు సినిమాలు ఉన్నా సరే గట్టిగా మాట్లాడారని.. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నవారే తమవారని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ ప్రవచనాలు చెప్పారని.. ఓం శాంతి, ఓ శాంతి అంటే పిల్లలు నవ్వారంటూ ఎద్దేవా చేశారు. తారక్ ఒక్క మాట అని ఉంటే నాని, వంశీలు జగన్‌ను కూడా వదిలేసి వెళ్లేవారన్నారు. అప్పుడే హెచ్చరించి ఉంటే నోరు మూసుకునేవారని, అది ఎన్టీఆర్ పవర్ అన్నారు. ఈ విషయంలో తాను చాలా బాధపడ్డానని చెప్పుకొచ్చారు. బాలయ్య స్పందించిన దాంట్లో తారక్ 10శాతం కూడా స్పందించలేదని చెప్పుకొచ్చారు. బూతుల మంత్రి కొడాలి నానికి ఎన్టీఆర్ అంటే చాలా భయమని.. అలాంటి వారిని కంట్రోల్ చేసే శక్తి తారక్‌కే ఉందని చెప్పుకొచ్చారు. అయితే తాను చేసిన వ్యాఖ్యలతో చంద్రబాబు, పార్టీకి సంబంధం లేదని ఈ వ్యాఖ్యలు పూర్తిగా తన వ్యక్తిగతం అని వర్ల రామయ్య స్పష్టం చేశారు.