- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
బాబు వైజాగ్ టూర్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు
దిశ వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డిపై టీడీపీ నేతలు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు కళావెంకట్రావు, వర్లరామయ్య, నక్కా ఆనంద్‌బాబు తదితరులు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. విశాఖలో జగన్ పులివెందుల రాజకీయాలు చేస్తున్నారని వారు ఈ సందర్భంగా ఆరోపించారు.
చంద్రబాబు పర్యటనకు అన్ని అనుమతులు ఉన్నాయని, అయినా రాజకీయ కక్షతో అడ్డుకున్నారని కళావెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉండే విశాఖలో వైఎస్సార్సీపీ అలజడి రేపుతొందని ఆయన ఆరోపించారు. పోలీసులు ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు.
సీనియర్ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ తమ ఫిర్యాదుపై గవర్నర్ సానుకూలంగా స్పందించారన్నారు. విశాఖలో మొన్న జరిగిన ఘటన చూసి దేశం అంతా నవ్వుకుందన్ని మండిపడ్డారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ జెడ్ ప్లస్ భద్రత ఉన్న చంద్రబాబును రౌడీషీటర్లు అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు.