‘మహిళా కమిషన్‌కి యాక్షన్ తక్కువ.. ఓవర్ యాక్షన్ ఎక్కువ’

by srinivas |
‘మహిళా కమిషన్‌కి యాక్షన్ తక్కువ.. ఓవర్ యాక్షన్ ఎక్కువ’
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ మహిళా కమిషన్‌‌కి యాక్షన్ తక్కువ ఓవర్ యాక్షన్ ఎక్కువ అని టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత విమర్శించారు. మహిళా కమిషన్ వైఎస్సార్సీపీ మిషన్‌గా మారిందని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో గంటకో మహిళపై అఘాయిత్యం జరుగుతుంటే మహిళా కమిషన్ ఒక్క రోజైనా స్పందించిందా? అని ప్రశ్నిచారు. గుంటూరు జిల్లాలో బీటెక్ విద్యార్ధిని కేసులో సాక్ష్యాలు తారుమారు చేస్తుంటే మహిళా కమిషన్ ఏం చేస్తోంది? అని నిలదీశారు. బాధితులను బెదిరించిన రౌడీషీటర్‌ను ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? అని ఆమె సూటిగా అడిగారు. మహిళా కమిషన్ మహిళల హక్కుల కోసం పనిచేస్తోందా? లేదా వైఎస్సార్సీపీ కార్యకర్తలను కాపాడేందుకు పనిచేస్తోందా? అని ఆమె ప్రశ్నించారు.

Advertisement

Next Story