- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అంకులు హత్యతో భగ్గుమన్న పల్నాడు
దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా దాచేపల్లి మాజీ సర్పంచ్, టీడీపీ లీడర్ పురంశెట్టి అంకులు మర్డర్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. వైసీపీ నేతల బెదిరింపులకు లొంగనందుకే అంకులును హత్య చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి ఆ పార్టీ కార్యకర్త వరకు ఇదే ఆరోపణ చేస్తున్నారు. అంకులు హత్యలో వైసీపీ నేతల హస్తం ఉందని కుటుంబీకులు కూడా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 33మందిపై అంకులు కుమారుడు పరంజ్యోతి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన తండ్రి హత్య కేసులో పెదగార్లపాడుకు చెందిన వైసీపీ నేతలు ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కాగా పురంశెట్టి అంకులు హత్యోదంతంతో పల్నాడులో మరోసారి హత్యారాజకీయాలు భగ్గుమన్నాయి. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన తొలినాళ్లలో పల్నాడులో టీడీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని, టీడీపీ వర్గీయులను ఊరి నుండి వేలేస్తున్నారని టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార, విపక్షాలు ఒకరిపై ఒకరు పెద్దఎత్తున రాజకీయ ఆరోపణలకు దిగారు. అదే తరుణంలో టీడీపీ, వైసీపీ ఒకేరోజు “చలో ఆత్మకూరు” నినాదంతో భారీ ఆందోళన కార్యక్రమం చేపట్టాయి. అయితే టీడీపీ నేతలు ‘చలో ఆత్మకూరు’ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పల్నాడులో రాజకీయ రగడ నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా తెలుగు దేశం పార్టీ నేతల హౌస్ అరెస్టులతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
రాష్ట్రంలో వైసీపీ నేతలు రౌడీల్లా వ్యవహరిస్తున్నా.. పోలీస్ వ్యవస్థ ప్రభుత్వానికి అంటకాగుతుందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సహా పలువురు నేతలు బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న పోలీసులు కట్టుదిట్టమైన చర్యలతో పల్నాడులో రాజకీయ రగడకు తెరదించారు. ఇప్పుడు టీడీపీ నేత పురంశెట్టి అంకులు మర్డర్‌తో పల్నాడులో మరోసారి రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. టీడీపీ నేతల ఆందోళనలతో రాష్ట్రంలో మరోసారి పల్నాడు హాట్ టాపిక్ గా మారింది.