స్పీకర్‌ తమ్మినేనిపై కూన రవి షాకింగ్ కామెంట్స్

by srinivas |
స్పీకర్‌ తమ్మినేనిపై కూన రవి షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్ :
ఏపీ రాజకీయాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. అధికార పార్టీనేతలు ప్రతిపక్షం మీద, ప్రతిపక్ష టీడీపీ వైసీపీ పార్టీ మీద విమర్శనాస్త్రాలు సందించుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసకు చెందిన టీడీపీ నేత కూన రవికుమార్ ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారం మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు నేడు పనుల పేరుతో కొత్త అవినీతి కార్యక్రమానికి తెరలేపారన్నారు. పాఠశాలల రిపేర్లు, సదుపాయాల కల్పన మాటున అవినీతిని కొత్త పుంతలు తొక్కిస్తున్నారని ఆయన ఆరోపించారు.

నాడు – నేడు కార్యక్రమం వైసీపీ కార్యకర్తలకు ఉపాధి పథకంలా మారిందని.. ఆయన పాతబల్డింగ్‌లకు తూతూమంత్రంగా రిపేర్లు చేసి దోచుకుంటున్నారని అన్నారు. ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలో నాడు-నేడు పనుల్లో భారీగా దోచుకుంటున్నారని తమ్మినేని సీతారాం అవినీతికి అడ్డులేకుండా పోయిందని కామెంట్స్ చేశారు. ఆయన ఇంటిపేరు అవినీతి అని.. ఆయన పేరు అవినీతి సీతారాం అని విమర్శించారు. సీతారం ఆర్.ఆర్.గ్రానైట్స్ వద్ద రూ.30 లక్షల కమీషన్ తీసుకున్నాడని కూన రవి ఆరోపించారు.

Advertisement

Next Story