నీది ఆడరక్తమేనా..? నువ్వో ఆడరౌడీవి.. దివ్యవాణి అనూహ్య వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2021-10-22 06:42:03.0  )
నీది ఆడరక్తమేనా..? నువ్వో ఆడరౌడీవి.. దివ్యవాణి అనూహ్య వ్యాఖ్యలు
X

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజా ఆడ రౌడీ అంటూ పరోక్షంగా విమర్శలు కురిపించారు. రోజాది గబ్బునోరు.. మున్సిపాలిటీ నోరు అంటూ ధ్వజమెత్తారు. సీఎం వైఎస్ జగన్‌కు చంద్రబాబు క్షమాపణలు చెప్పకపోతే భువనేశ్వరి నీవు ఎన్టీఆర్ రక్తం కాదు అంటూ రోజా వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు. రోజా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అప్పటి సీఎం వైఎస్ఆర్‌ ను పంచలూడదీసి తన్నాలి అని పిలుపునివ్వలేదా అని ప్రశ్నించారు. వైసీపీలో ఉన్నప్పుడు కేసీఆర్ తాగుబోతు అని తిట్టి.. ఆ తర్వాత ఇంటికి పిలిచి భోజనం పెడతావా అని ప్రశ్నించారు.

మహాపతివ్రత భువనేశ్వరిని ఉచ్చరించే అర్హత నీకు లేదు అని రోజాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. డబ్బుకోసం.. పదవి కోసం ఏ ఎండకు ఆ గొడుగు పట్టే మీకు టీడీపీని విమర్శించే అర్హత లేదని ధ్వజమెత్తారు. టీడీపీని స్ఫూర్తిగా తీసుకుని బతకాలి మీరు అంటూ తీవ్ర స్థాయిలో దివ్వవాణి ధ్వజమెత్తారు. నీది ఆడ రక్తమేనా అని ప్రశ్నించారు. భువనేశ్వరి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. డబ్బుకోసం అధికారం కోసం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. మీ నాలుకలు కోసి ఉప్పుకారం అద్దాలని ఉంది. సంస్కారం ఉంది కాబట్టి ఆ పని చేయలేకపోతున్నామని దివ్యవాణి చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed