’ప్రజాశ్రేయస్సుకంటే మీ ఆదాయమే ముఖ్యమా‘

by srinivas |
’ప్రజాశ్రేయస్సుకంటే మీ ఆదాయమే ముఖ్యమా‘
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా నివారణపై వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై టీడీపీ నేత దేవినేని ఉమ విమర్శలు చేశారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా మద్యం షాపులు మూసివేయాలని ప్రజల నుంచి డిమాండ్ వస్తోందని తెలిపారు. నిత్యావసరాలకు ఉదయం 11 గంటల వరకేనంటూ.. మద్యం అమ్మకాలకు మాత్రం రాత్రి 9 గంటల వరకు ఎలా అనుమతిస్తారని దేవినేని ఉమ ప్రశ్నించారు. సీఎం జగన్ ఎన్నికల ముందు చెప్పిన మద్యపాన నిషేదం అంటూ ఉమ ఎద్దేవా చేశారు. మద్యం షాపులను అరికట్టాలని డిమాండ్ చేశారు. ప్రజా శ్రేయస్సుకంటే మీ ఆదాయమే ముఖ్యమా జగన్ అంటూ దేవినేని ఉమ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story