అఖిలప్రియ నన్ను చంపాలని చూస్తున్నారు : టీడీపీ నేత

by srinivas |   ( Updated:2020-06-04 08:02:12.0  )
అఖిలప్రియ నన్ను చంపాలని చూస్తున్నారు : టీడీపీ నేత
X

దిశ, ఏపీ బ్యూరో: రాజకీయ కుట్రలో భాగంగా టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ రాముడు తనను హతమార్చేందుకు కుట్ర పన్నారని సొంత పార్టీ నేత, ఏవీ సుబ్బారెడ్డి సంచలన ఆరోపణలు చేయడంతో కర్నూలు జిల్లా టీడీపీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వారి అనుచరులు రవిచంద్రారెడ్డి, రాంరెడ్డి, సంజోరెడ్డితో చేతులు కలిపి తనను హతమార్చాలని చూస్తున్నారని ఆయన వెల్లడించారు. తనను హతమార్చేందుకు రూ.50 లక్షలు సుపారీ కూడా మాట్లాడుకున్నారంటూ బాంబు పేల్చారు. దీనిపై తాను కడప పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు ఆ కుట్రను భగ్నం చేసి తనను కాపాడారని ఆయన వెల్లడించారు. పోలీసులు విచారణలో నిందితులు పలు నిజాలను వెల్లడించారు. భూమా అఖిలప్రియ అనుచరుడు శ్రీను తమకు డబ్బులు ఇచ్చాడని నిందితులు తెలిపారని ఆయన వివరించారు. భూమా అఖిలప్రియ, భార్గవ రాముడిని వెంటనే అరెస్ట్‌ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో అఖిలప్రియ భర్తపై ఇప్పటికే రెండు కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed