- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
స్టీల్ ప్లాంట్ కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం :నారా లోకేష్
దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని ప్రతీ పౌరుడు పోరాటబాటపట్టాల్సిన అవసరం ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద రిలే నిరాహార దీక్ష చేస్తున్న కార్మికులకు, నిర్వాసితులకు లోకేష్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది కాబట్టి అమ్మేస్తున్నాం అంటున్న కేంద్రం లాభాల్లో ఉన్న ఎల్ఐసిని ఎందుకు అమ్మేస్తున్నారని ప్రశ్నించారు. గల్లీ నుండి ఢిల్లీ వరకూ రాజకీయాలకు అతీతంగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడానికి పోరాటం చేసేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందన్నారు.
విశాఖ ఉక్కు విస్తరణ కోసం ఖర్చు చేసిన వ్యయం వలనే నష్టాలు కనిపిస్తున్నాయని చెప్పుకొచ్చారు. రాబోయే మూడు, నాలుగేళ్లలో మళ్ళీ లాభాల్లోకి రావడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకమని చెప్పుకొచ్చారు. విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగ సంస్థ గా కొనసాగిస్తాం అని ప్రకటించే వరకూ తమ పోరాటం ఆగదని తెలిపారు. మార్చి 5న వామపక్షాల బంద్ కి తమ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని లోకేష్ స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై ప్రత్యక్షంగానూ.. పరోక్షంగానూ దాదాపు లక్ష మంది ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. అలాంటి స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తే అంతా రోడ్డున పడతారని నారా లోకేష్ తెలిపారు.